Molangoor”
కరీంనగర్ జిల్లా, శంకరపట్నం మండలం, మానకొండూర్ నియోజకవర్గం:
మొలంగూర్ గ్రామంలో రజకుల జీవనోపాధి కోసం నిర్మించిన ముఖ్యమైన ధోబిగాడ్ ధ్వంసంపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. రజక సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.
ఘటన వివరాలు:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రజకుల కుల వృత్తి అభివృద్ధికి లక్షల రూపాయల నిధులు వసూళ్లుచేసి మొలంగూర్ గ్రామంలో ధోబిగాడ్ నిర్మించారు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం అక్కడి ఓ వ్యక్తి, హైదరాబాదులో నివసించే అగ్రకుల వర్గానికి చెందినవారు, ఈ ధోబిగాడ్ను ధ్వంసం చేసి, లక్షల రూపాయలకు విక్రయించారు. ఇప్పుడేమి జరుగుతుందంటే, ఆ భూమిపై ఇల్లు నిర్మించబడుతున్నది.
రజక సంఘం నాయకులు, ఈ చర్య రజకుల జీవనోపాధిని క్షీణింపజేసిందని, సంబంధిత వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తగిన న్యాయం చేయాలని, క్షేత్రస్థాయి విచారణకు తాసిల్దార్ను ఆదేశించాలని కోరారు.
కలెక్టర్ స్పందన:
జిల్లా కలెక్టర్ అధికారి ఈ ఫిర్యాదును స్వీకరించి, క్షేత్రస్థాయి విచారణ కోసం శంకరపట్నం తాసిల్దార్కు ఆదేశాలు జారీ చేశారు.

