Ration Distribution” గ్రామాల అభివృద్ధి, పేదల ఆకలి తీరుస్తున్నది బీజేపీ ప్రభుత్వం: పాలాభిషేకం ద్వారా ప్రధానికి కృతజ్ఞత

Ration Distribution” శంకరపట్నం, కరీంనగర్ జిల్లా:

గ్రామాల అభివృద్ధికి కృషిచేస్తూ, పేదల ఆకలిని తీరుస్తున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అని బీజేపీ శక్తి కేంద్రం ఇన్‌ఛార్జ్ రాస మల్ల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలం కరీంపేట గ్రామంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి, బీజేపీ కార్యకర్తలు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.

iQOONeo10″ ఐక్యూ నియో 10 విడుదల – 144FPS గేమింగ్, 7000mAh బ్యాటరీతో మార్కెట్‌లో సంచలనం!

మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయడంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని, వర్షాకాలంలో పేదలు ఇబ్బంది పడకుండా ముందస్తుగా సరుకులు అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని శ్రీనివాస్ పేర్కొన్నారు.

ఇటీవల గ్రామాలలో నిర్మించిన సిసి రోడ్లు, మురికికాలువలు, కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరిగాయని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ గ్రామీణాభివృద్ధికి కట్టుబడి ఉన్నారని వెల్లడించారు.

iQOONeo10″ ఐక్యూ నియో 10 విడుదల – 144FPS గేమింగ్, 7000mAh బ్యాటరీతో మార్కెట్‌లో సంచలనం!

ఈ కార్యక్రమంలో మాజీ కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ ఖాజా పాషా, బూత్ అధ్యక్షుడు గోపి శ్రీనివాస్, నాయకులు మెడిశెట్టి రాజేష్, అడెపు శ్రీనివాస్, మెడిశెట్టి రాకేష్, గంపల శివాజీ, నాంపల్లి అజయ్, చింతం రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *