Mla Satyanarayana” ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ – విద్యార్థుల పట్ల ప్రేమానురాగంతో వ్యవహరించాలి: ఎమ్మెల్యే సత్యనారాయణ

Mla Satyanarayana”  శంకరపట్నం డీసి ప్ర‌తినిధి, కరీంనగర్: మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా. కపంపల్లి సత్యనారాయణ మంగళవారం శంకరపట్నం మండలం కేశవపట్నంలో ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యా బోధనల ప్రగతితో పాటు, విద్యార్థులకు అందుతున్న పౌష్టికాహారం, వసతిగృహాల పరిస్థితులపై ప్రత్యక్షంగా సమీక్షించారు.

ఈ సందర్బంగా విద్యార్థులతో కలసి మధ్యాహ్న భోజనం చేసి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చిన సమస్యల మేరకు, వంట మనిషి   విద్యార్థుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తోందని, వసతిగృహంలో ఉన్న బాలికలతో వ్యక్తిగత పనులు చేయిస్తున్నారని ఆరోపణలు వినిపించాయి.

ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే సత్యనారాయణ, డీఈవో శ్రీరామ్ మొండయ్య, జీజీఓ కృపారాణిలకు టెలిఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేస్తూ, వంట మనిషి రేణుకపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. “విద్యార్థుల పట్ల ప్రేమానురాగంతో, కన్నబిడ్డల వలే చూడాలి” అని సిబ్బందిని ఆయన ఆదేశించారు.

ఇతర పరిశీలనలు:

అనంతరం ఎమ్మెల్యే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా పరిశీలించారు. ఆసుపత్రి నిర్వహణ, వైద్య సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.

‍‍ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:

  • తహసిల్దార్ కే. రేణుక

  • పాఠశాల స్పెషల్ ఆఫీసర్ సరిత

  • మండల వైద్యాధికారి గొట్టే శ్రావణ్ కుమార్

  • టిపిసిసి సభ్యులు, మాజీ జడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్

  • వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి

  • కాంగ్రెస్ మండలాధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్

  • యూత్ కాంగ్రెస్ నేతలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Borosil Neo గ్లాస్ వాటర్ బాటిల్ – 550ml
బ్లూ హస్క్ లిడ్‌తో స్టైలిష్ లుక్
వేడి ❄️ చల్లని – రెండింటికీ రెడీ!
మిల్క్ | లస్సీ | జ్యూస్ | వాటర్ – అన్నింటికీ సురక్షితం
బోరోసిలికేట్ గ్లాస్ – ఫ్రిజ్‌కి, హీట్‌కి రెసిస్టెంట్
వైడ్ మౌత్ డిజైన్ – క్లీన్ చేయడం సులభం
✨ 100% ట్రాన్స్‌పరెంట్ & లీక్ ప్రూఫ్

స్టైల్ & హెల్త్ – రెండింటికీ సరైన బాటిల్!
ఇప్పుడు ఆర్డర్ చేయండి – మీరు ప్రేమించే బ్రాండ్ Borosil

కొనుగోలు కోసం లింక్ పై క్లిక్ చేయండి.. https://amzn.to/4lEbpmL 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *