Mandal School” మండల విద్యాధికారి లక్ష్మీనారాయణ..
శంకరపట్నం: డిసి ప్రతినిధి:
పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా పోటీలు కేశవపట్నం జిల్లా పరిషత్ పాఠశాల మైదానంలో నిర్వహించనున్నట్లు మండల విద్యాధికారి లక్ష్మీనారాయణ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈఓ లక్ష్మీనారాయణ తాడికల్ జిల్లా పరిషత్ పాఠశాల ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం స్థాయి క్రీడా పోటీలు ఆగస్టు 28, 29 తేదీలలో కేశవపట్నం జిల్లా పరిషత్ పాఠశాల మైదానంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీలలో అండర్ 14, అండర్ 17 వయసుగల బాల బాలికలు ప్రభుత్వ ప్రైవేటు కేజీవీబీ మోడల్ స్కూల్ లలో విద్యను అభ్యసించే బాలబాలికలు పోటీలకు అర్హులని తెలిపారు. ఈ పోటీలలో కబడ్డీ , ఖోఖో వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందని, పూర్తి వివరాల కోసం క్రీడా కార్యదర్శి ఆడెపు శ్రీనివాస్ 9848838704 నంబర్ కు ఫోన్ చేసి పూర్తి సమాచారం పొందవచ్చునని ఎంఈఓ తెలిపారు. ఈ సమావేశంలో క్రీడా కార్యదర్శి ఆడెపు శ్రీనివాస్, ఉపాధ్యాయులు రాజ్ కుమార్ ,రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

BIGGIE BEAN BAG
ఇప్పుడు మీ హాల్, బెడ్‌రూం లుక్ మార్చేసే టైం!
⚽ స్పోర్ట్స్ థీమ్ లో అదిరిపోయే డిజైన్
️ 4XL సైజ్ – గమ్మత్తైన సోఫా కంఫర్ట్
✅ రెడీ ఫిల్డ్ – ఎలాంటి హాసిల్ లేదు
ఫ్రీ కుషన్ & ఫుట్‌రిస్ట్ తో అదనపు కంఫర్ట్
మెరుస్తున్న ఫాక్స్ లెదర్ ఫినిష్
బ్లాక్ & గ్రీన్ స్పోర్ట్స్ మూడ్ కలర్
ఇలాంటిది మీ గది లో ఉండాలి గదా?
అడుగు పెట్టండి – కంఫర్ట్ & స్టైల్ ఒకేసారి!
అమెజాన్‌లో కొనేందుకు https://amzn.to/45Ud8yR లింక్ పై క్లిక్ చేయండి..
