Shankarapatnam School” విద్యార్థుల పట్ల ప్రేమ అనురాగాలు తప్పనిసరి…

Shankarapatnam School”  ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మెనూ పాటించాలి…
జిల్లా విద్యాశాఖ అధికారి మొండయ్య…
శంకరపట్నం డిసీ ప్రతినిధి
విద్యార్థుల పట్ల ప్రేమ అనురాగాలు త‌ప్ప‌నిస‌రిగా ఉండాల‌ని జిల్లా విద్యాశాఖ అధికారి మొండయ్య అన్నారు. వసతి గృహాల్లో ఉండి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయులు సిబ్బంది. నిరంకుశంగా వ్యవహరిస్తే శాఖ పరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.

గురువారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ పాఠశాల, మోడల్ స్కూల్, వసతి గుహాలను, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరామ్ కొండయ్య, జి సి ఈ ఓ కృపారాణి, ఆకస్మికంగా తనిఖీ చేశారు . పాఠశాల, వసతి గృహాల్లో శూన్యంగా పరిశీలించి మాట్లాడారు.

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో వసతి గృహాల్లో విద్యార్థులకు ప్రభుత్వం జారీ చసిన మెనూ ప్రకారం రుచికరంగా వంట చేసి విద్యార్థిని విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. రెండు రోజుల క్రితం కేశవపట్నం లోని కస్తూరిబా గాంధీ పాఠశాలను మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేసి పాఠశాల నిర్వహణపై సిబ్బంది వ్యవహారంపై ఫోన్ ద్వారా పలు సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చి శాఖ పరంగా చర్యలకు ఆదేశించినట్లు వెల్లడించారు.

ఎమ్మెల్యే సత్యనారాయణ ఆదేశం మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, తన పరిశీలనలో వెళ్లడైన అంశాలను శాఖ పరంగా, సమస్యల పరిష్కారానికి కృషిచేసి సిబ్బంది వ్యవహారంపై చర్యలు తీసుకునేందుకు నివేదికలను తయారు చేస్తామని వెల్లడించారు. కస్తూరిబా పాఠశాల ఇంటర్మీడియట్ విద్యార్థినిలకు పుస్తకాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో జిసిఈఓ కృపారాణి, ఎంఈఓ లక్ష్మీనారాయణ, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సరిత, కస్తూరిబా పాఠశాల ఎస్ఓ మాధవి, ఉపాధ్యాయులు ఉపాధ్యాయనీలు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Fire Accident” షాపింగ్ మాల్‌లో ఘోర అగ్నిప్రమాదం: కనీసం 60 మంది మృతి

 

బంపర్ ఆఫర్!
పానసొనిక్ 10W LED బ్యాటన్ (Pack of 4)
ఇప్పుడు కేవలం ₹549కే!
39% డిస్కౌంట్
కూల్ డే వైట్ లైట్ ✨
ఎనర్జీ సేవింగ్ | నమ్మకమైన బ్రాండ్

ఇంత తక్కువ ధరలో అంత మంచి క్వాలిటీ!
తడాపట్టి లైట్ మార్చేయండి!

#పానసొనిక్ #LEDలైట్స్ #హోమ్‌డీల్ #సేవింగ్
అమెజాన్‌లో కొనుగోలు కోసం https://amzn.to/3GJquo0 లింక్ పై క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *