రామడుగులో సంక్రాంతి ముగ్గుల పోటీ

 

రామడుగు :

సంక్రాంతి పండుగ సందర్భంగా రామడుగు మండలకేంద్రంలో శివాజీ సేన యూత్ ఆధ్వర్యంలో మంగళవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. మొదటి బహుమతి సాధించిన సామంతుల శ్రీలేఖకు రూ.5 వేలు, రెండో బహుమతి నామని లావణ్యకు మిక్సర్, మూడో బహుమతి సాధించిన దండవేణి రాజేశ్వరికి ప్రెషర్ కుక్కర్, నాలుగో బహుమతి సాధించిన రెడ్డి సమతకు సిల్వర్ కాయిన్ను ఎస్సై కె.రాజు అందజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బొమ్మరవేణి తిరుమల తిరుపతి, సర్పంచ్ ఎండీ.మోయిజ్, ఉప సర్పంచ్- పెందోట రాజు, వార్డు మెంబర్లు, యూత్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *