karimnagar-railway” జమ్మికుంట-రైల్వే స్టేషన్ ను ‘‘అమృత్ భారత్’’లో చేరుస్తాం

karimnagar-railway”  కరీంనగర్, మదర్ న్యూస్ ప్రతినిధి:
కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఆధునీకరించిన 103 రైల్వే స్టేషన్లను వర్చువల్ ద్వారా ప్రారంభించగా, అందులో కరీంనగర్ స్టేషన్ ఒకటి.

ఈ కార్యక్రమంలో బండి సంజయ్‌తో పాటు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, జమ్మికుంట రైల్వే స్టేషన్‌ను త్వరలోనే “అమృత్ భారత్” పథకంలో చేర్చనున్నట్లు వెల్లడించారు.

హసన్‌పర్తి – కరీంనగర్ మధ్య 61 కి.మీ నూతన రైల్వే మార్గం కోసం సర్వే పూర్తయినట్టు, రూ.1480 కోట్ల వ్యయంతో డీపీఆర్ సిద్ధమైందని తెలిపారు. కేంద్రం త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.

కరీంనగర్-తిరుపతి మధ్య ప్రస్తుతం వారానికి రెండు సార్లు నడుస్తున్న రైలును, వారానికి నాలుగు సార్లు నడిపే ప్రయత్నాలు చేస్తున్నట్టు హామీ ఇచ్చారు.

రైల్వే అభివృద్ధి – కేంద్ర ప్రాధాన్యత
దేశవ్యాప్తంగా 25 వేల కోట్ల రూపాయల వ్యయంతో 1350 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్టు చెప్పారు. కేవలం తెలంగాణలోనే రూ.42,119 కోట్ల విలువైన పనులు ప్రగతిలో ఉన్నాయని, ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.5,337 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు.

కరీంనగర్ స్టేషన్ ఆధునీకరణపై వివరాలు వెల్లడించిన బండి సంజయ్, ఎయిర్‌పోర్టు స్థాయి సదుపాయాలతో (లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఎసీ / నాన్‌ఎసీ హాల్స్, ఫుడ్ కోర్టులు, సోలార్ పవర్ ప్లాంట్ మొదలైనవి) రైలు ప్రయాణికులకు మెరుగైన అనుభవం అందిస్తామన్నారు.

ప్రజల కోరిక మేరకు ముంబై, షిరిడి రైలు డిమాండ్
రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, కరీంనగర్ నుండి ముంబై, షిరిడి లాంటి నగరాలకు కూడా రైలు సేవలు అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో స్టేషన్ అభివృద్ధికి కృషిచేసిన విషయాన్ని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో  శాసనమండలి సభ్యులు చిన్న మైల్ అంజిరెడ్డి, మల్క కొమురయ్య, అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ ఆర్. గోపాలకృష్ణన్, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం సహా పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా వార్త‌ల కోసం దీనిపై క్లిక్ చేయండి

Karimnagar Rain” వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

huzurabad acp” హుజురాబాద్ ఏసిపిగా మాధవి బాధ్యతల స్వీకరణ .. madhavi-huzurabad-acp-assumes-charge

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *