Bihar” పట్నాలోని పరాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెరోల్ పై ఉన్న వ్యక్తిని ఐదుగురు దుండగులు గన్‌తో కాల్చి చంపారు. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఈ దారుణ ఘటనలో మొదటి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. టౌసీఫ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, మిగతా నిందితులను పట్టుకోవడానికి పలు ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులంతా గుర్తించబడ్డారు. వీడియోలో దుండగులు తుపాకులు బయటకు తీసి, లోడ్ చేసి, ఆస్పత్రిలోని గదిలోకి ప్రవేశించి, కాల్చి పారిపోయిన దృశ్యాలు నమోదయ్యాయి. చందన్ మిశ్రా అనే వ్యక్తిని వారు హత్య చేశారు.
చనిపోయిన చందన్ మిశ్రా పలు హత్యల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. వైద్య కారణాల రీత్యా పరోల్‌పై విడుదలై పరాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సమయంలో ఈ దాడి జరిగింది. ఇది ప్రత్యర్థి గ్యాంగ్ పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు.
“బక్సర్ జిల్లా నివాసి అయిన చందన్ మిశ్రాపై పలు హత్య కేసులు ఉన్నాయి. బక్సర్ నుంచి భగల్‌పూర్ జైలు తరలించబడ్డాడు. పరోల్‌పై ఆసుపత్రిలో చేరిన అతనిపై ప్రత్యర్థి గ్యాంగ్ దాడి చేసింది. అని సీనియర్ ఎస్పీ కార్తికేయ శర్మ తెలిపారు.
पुलिस का इकबाल “क्षय”, अधिकारी बने “रंक”
गुंडे बने “विजय” व अपराधी बने “सम्राट”
अस्पताल में घुसकर बेख़ौफ़ अपराधियों में गोली मारी। कल प्रधानमंत्री इसी जंगलराज पर प्रवचन देने बिहार आ रहे है। #Crime #Bihar #india pic.twitter.com/BDProZcPrw
— Tejashwi Yadav (@yadavtejashwi) July 17, 2025
