Congress welfare” కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి తిరుపతి…
శంకరపట్నం డిసీ ప్రతినిధి..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదిగి ఇందిరా గాంధీ కలలను సాకారం చేయాలని కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి బండారి తిరుపతి అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం కేశపట్నం గ్రామంలో సోమవారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇండ్లకు ముగ్గు పోశారు.
ఈ కార్యక్రమానికి హాజరైన తిరుపతి గౌడ్ మాట్లాడారు. దేశ ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ అది నాయకురాలు దివంగత మహానేత ఇందిరా గాంధీ పేదింటి ఇండ్ల కళలను సహకారం చేసేందుకు దేశంలో నాడు ప్రధానిగా ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అనేక ఇండ్లను పేదలకు అందించారని తెలిపారు. ఇందిరాగాంధీ కలలను సాకారం చేసేందుకు నేడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రివర్గం ఎమ్మెల్యేలు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తున్నారన్నారు.
లబ్ధిదారులు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలోఈ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బొజ్జ చంద్రమౌళి, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ ఇసాముద్దీన్, గ్రామ శాఖ అధ్యక్షులు మొలంగూరి సదానందం, సీనియర్ నాయకులు కల్లేపల్లి రాజయ్య, లబ్ధిదారులు, తదితరులు ఉన్నారు.

ఇప్పుడు డ్రైయింగ్ కి కొత్త స్టైల్!
Heart Home Cloth Drying Hanger Rack – 32 క్లిప్స్
360° రొటేటబుల్ | ఫోల్డబుల్ | ట్రావెల్ ఫ్రెండ్లీ
చిన్న వస్త్రాలు సులభంగా ఎండేసేయండి – మరింత స్పేస్ సేవింగ్! ️
సాక్స్, టవెల్స్, బేబీ క్లొత్స్ కి బెస్ట్
ఇంట్లో లేదా బల్కనీలో – ఎక్కడైనా సెట్ అవుతుంది!
మిలటరీ గ్రీన్ కలర్ – స్టైలిష్ & మల్టీపర్పస్
ట్రావెల్‌కు తీసుకెళ్లడానికి బాగుంటుంది
సైజు: 40 x 38 x 30 CM
అమెజాన్‌లో లభ్యం! https://amzn.to/452tMuJ కొనుగోలు కోసం లింక్ పై క్లిక్ చేయండి..
