Sankshema pathakalu” ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలి…
టీపీసీసీ సభ్యులు మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ గౌడ్..
శంకరపట్నం డిసి ప్రతినిధి
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందజేస్తుందని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని టిపిసిసి సభ్యులు, మాజీ జెడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలంలోని ఎరడపల్లి గ్రామంలో శ్రీనివాస్ గౌడ్ క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇండ్లను మంగళవారం పరిశీలించి మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో దివంగత మహానేత భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కలలను సాకారం చేయాలని, ఇల్లు లేని పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వము ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రివర్గం ఎమ్మెల్యేలు ఇందిరమ్మ పథకం ద్వారా ఇడ్లీ లేని పేదలకు ఇండ్ల నిర్మాణం కోసం మంజూరు పత్రాలు అందజేశారన్నారు. 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు.
మొదటి విడతలో మంజూరైన లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసి మండలాన్ని రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుపుతూ ఇండ్లు లేని అర్హులైన పేదలకు రెండో విడత మంజూరు కోసం కృషి చేయాలని సూచించారు. ఇండ్ల నిర్మాణం వేగవంతం చేసి ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తే అర్హులైన పేదలకు మరిన్ని ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్, యూత్ కాంగ్రెస్ మానకొండూరు నియోజకవర్గ ఉపాధ్యక్షులు మహమ్మద్ షారుక్, గ్రామ మాజీ ఉపసర్పంచ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు పంజాల వెంకటేశం, కేశవపట్నం గ్రామ శాఖ అధ్యక్షులు మొలంగూరి సదానందం, యువజన నాయకులు భూమ ప్రవీణ్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, లబ్ధిదారులు ఉన్నారు.

ఆరోగ్యం కోసం
AMAYU ప్రీమియం రా సన్‌ఫ్లవర‍్ సీడ్స్ – 200 g
➡️ కేవలం ₹189* (62% ఆఫర్)
ప్రోటీన్, ఫైబర్, విటమిన్ E, సేలెనియం – అన్ని మీ డైట్‌లో!
హెచ్‌చెల్త్, గుండె-హెల్త్, బరువు నియంత్రణకు అదుర్స్
స్నాక్ లేదా సలాడ్ టాపింగ్‌గా యవ్వన ఆరోగ్యం
ప్రోడక్ట్ హైలైట్స్:
200 గ్రామ్‌లో పూర్తి పోషకాహారం: 22 g ప్రోటీన్, 9.5 g ఫైబర్, స్థూల కొవ్వులు (monounsaturated & polyunsaturated)
అమెజాన్‌లో కొనుగోలు కోసం https://amzn.to/40wYGd8లింక్ పై క్లిక్ చేయండి…
