Rajapur” ప్రతినిధి: శంకరపట్నం డీసీ
కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలం రాజాపూర్ గ్రామంలో బుధవారం విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన మాతంగి భాగ్యలక్ష్మి (వయసు 43) గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.
భాగ్యలక్ష్మి గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో ఆశా కార్యకర్తగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ విశేష సేవలందిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండే ఆమెకు ఎటువంటి బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు లేవని కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం ఆకస్మికంగా గుండెపోటు రావడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు.
ఆమె మరణ వార్తతో గ్రామం అంతా విషాదంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యుల రోదనలు చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. భర్త, కుమారుడు, కుమార్తె ఉన్న ఈ కుటుంబానికి ఎలాంటి స్థిర ఆస్తులు లేవు. తాను మట్టిలో మాణిక్యం అయినా, ఇతరులకు సేవ చేస్తూ తన ప్రాణాలు కోల్పోయిందని గ్రామస్తులు వాపోతున్నారు.
ఆమె కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని, గ్రామస్తులు, ఆశా కార్యకర్తల మండల సంఘం, ఇతర ఆశా కార్యకర్తలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ ఘటనపై మండల వైద్యాధికారి డాక్టర్ గొట్టే శ్రావణ్ కుమార్ మరియు వైద్య సిబ్బంది సంతాపం తెలిపారు.

Acer Super ZX 5G – బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్స్!
ధర: ₹10,999 (45% తగ్గింపు)
⚡ 120Hz FHD+ డిస్‌ప్లే
Sony 64MP AI కెమెరా
Dimensity 6300 ప్రాసెసర్
5000mAh ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ
6GB RAM + 128GB స్టోరేజ్
Netflix/Prime కోసం L1 సర్టిఫికేషన్
డ్యూయల్ సిమ్ 5G
₹900 కూపన్, No Cost EMI
స్టైలిష్ లుక్. పవర్‌ఫుల్ ఫీచర్స్.
ఇప్పుడు ఆర్డర్ చేయండి!
Colour: Cosmic Green
కొనుగోలు కోసం https://amzn.to/45664xHలింక్ క్లిక్ చేయండి…
