Molangaru” శంకరపట్నం, జూలై 23:
కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గంలోని శంకరపట్నం మండలం, మొలంగూర్ గ్రామంలో 703 సర్వే నంబరులో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై హుజురాబాద్ డిఎల్పిఓ శ్రీనివాస్ క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు. బుధవారం ఆయన సంబంధిత ప్రాంతాన్ని పరిశీలించి, అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “అక్రమ నిర్మాణాలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు క్షేత్రస్థాయిలో పూర్తి సమాచారం సేకరించాం. కలెక్టర్ ఆదేశాల ప్రకారం వివరమైన నివేదికలను సిద్ధం చేసి, జిల్లా కలెక్టర్‌కు అందజేస్తాం. తదనుగుణంగా సంబంధిత శాఖలు తగిన చర్యలు తీసుకుంటాయి” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గోల్కొండ కృష్ణ ప్రసాద్, ఎంపీవో కాసగొని ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, కారోబార్ దాసరి మొగులయ్య, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ మొలుగూరి రాజకుమార్, ఫిర్యాదుదారుడు మోరె గణేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేసిన మోరె గణేష్
703 సర్వే నంబరులో అక్రమ నిర్మాణాలపై తెలంగాణ జన సమితి జిల్లా కన్వీనర్ మోరె గణేష్, జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా, కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అయితే, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు సమన్వయం లేకుండా విచారణలు జరపుతూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.
“ఫిర్యాదు మేరకు కలెక్టర్ అన్ని శాఖలతో సమిష్టిగా విచారణ చేయాలని సూచించినా, అధికారులు విడివిడిగా విచారణలు జరిపి, అసలు విషయాన్ని దారి తప్పిస్తున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో భూ పోరాటాన్ని కొనసాగిస్తాం. ఆక్రమించుకున్న భూమిపై ఉన్న రేకుల షెడ్లను తొలగించి ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించే వరకు పోరాటం ఆగదు,” అని గణేష్ స్పష్టం చేశారు.

మీ ఆరోగ్యానికి సహాయం చేసే చియా సీడ్స్!
Organic Box Raw Chia Seeds – 1kg Jar Pack
✅ న్యాచురల్ & రా
✅ ఫైబర్‌తో సమృద్ధిగా ఉంటుంది
✅ ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మంచి మూలం
✅ ఇమ్యూనిటీ బూస్టర్
✅ బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ డైట్ స్నాక్
ఇప్పుడు 42% తక్కువ ధరకు – కేవలం ₹349/- మాత్రమే!
4,000+ మంది గత నెలలో కొనుగోలు చేశారు
ఇప్పుడు ఆరోగ్యాన్ని స్టోర్ చేయండి
Organic Box Chia Seeds తో!
https://amzn.to/451xTa2కొనుగోలు కోసం లింక్ పై క్లిక్ చేయండి..
