Tsrtc free bus” ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు ఆర్థిక లాభం: తాసిల్దార్ సురేఖ

Tsrtc free bus”  శంకరపట్నం డిసీ ప్రతినిధి

కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గంలోని శంకరపట్నం మండలం కేశవపట్నం బస్టాండ్‌లో బుధవారం టీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత బస్సు ప్రయాణం సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తాసిల్దార్ కె. సురేఖ మాట్లాడుతూ, ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలకు గణనీయమైన ఆర్థిక లాభం కలుగుతోందని తెలిపారు.

ఆమె మాట్లాడుతూ..

“తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఇప్పటివరకు 200 కోట్ల సార్లు మహిళలు వినియోగించుకున్నారు. ఇది ప్రపంచంలోనే గొప్ప మహిళా ప్రయాణ పథకాల్లో ఒకటి. ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఈ సంబరాలు నిర్వహించడం అభినందనీయం.అన్నారు.

ఈ సందర్భంగా కేశవపట్నం జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థుల కోసం “ఉచిత బస్సు ప్రయాణం” పై వ్యాసరచన పోటీలు నిర్వహించబడ్డాయి. పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఐదుగురు విద్యార్థులకు బహుమతులు అందజేయడమైంది. ఈ కార్యక్రమం విద్యార్థులలో అవగాహన పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తాసిల్దార్ పేర్కొన్నారు.

అదేవిధంగా “మహిళలు ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని సద్వినియోగం చేసుకొని తమ కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవాలి” అని ఆమె సూచించారు.

ఈ కార్యక్రమంలో హుజురాబాద్ డిపో మేనేజర్ రవీంద్రనాథ్, టీఎస్‌ఆర్టీసీ సిబ్బంది గుర్రం స్వామి, రవీందర్ రెడ్డి, ఉపాధ్యాయినీలు, విద్యార్థినిలు, స్థానిక మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

మీ ఆరోగ్యానికి సహాయం చేసే చియా సీడ్స్!
Organic Box Raw Chia Seeds – 1kg Jar Pack

✅ న్యాచురల్ & రా
✅ ఫైబర్‌తో సమృద్ధిగా ఉంటుంది
✅ ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ మంచి మూలం
✅ ఇమ్యూనిటీ బూస్టర్
✅ బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ డైట్ స్నాక్

ఇప్పుడు 42% తక్కువ ధరకు – కేవలం ₹349/- మాత్రమే!

4,000+ మంది గత నెలలో కొనుగోలు చేశారు

ఇప్పుడు ఆరోగ్యాన్ని స్టోర్ చేయండి
Organic Box Chia Seeds తో!
https://amzn.to/451xTa2 కొనుగోలు కోసం లింక్ పై క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *