Special Appreciation Award” ప్రత్యేక ప్రశంస బహుమతి అందుకున్న మొలంగూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం నీరజ…

Special Appreciation Award”  శంకరపట్నం: డిసీ ప్రతినిధి:
మొలంగూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎంగా విధులు నిర్వ‌ర్తిస్తున్న నీరజ ప్ర‌త్యేక ప్ర‌శంసా ప‌త్రాన్నిఅందుకున్నారు. కరీంనగర్ జిల్లా , మానకొండూర్ నియోజకవర్గం,శంకరపట్నం మండలం, మొలంగూర్ గ్రామంలో గల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచి వందకు వందశాతం పూర్తిగా విద్యార్థులు ఉత్తీర్ణులు కావడానికి కృషిచేసిన ఉపాధ్యాయుల సేవలను గుర్తించి ఈ అవార్డును అందించారు. ఉపాధ్యాయ దినోత్సవాల్లో భాగంగా బుధవారం కరీంనగర్ పట్టణంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, చేతుల మీదుగా పాఠశాల హెచ్ఎం కంకణాల నీరజకు ప్రత్యేక ప్రశంస బహుమతి అందజేసినట్లు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. పాఠశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణతకు కృషిచేసిన ఉపాధ్యాయ బృందానికి హెచ్ఎం నీరజకు మండల విద్యాధికారి లక్ష్మీనారాయణ, గ్రామ తాజా మాజీ ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

 

Redmi Pad Pro” పవర్‌ఫుల్ ఫీచర్లతో .. మీ డిజిటల్ అవసరాలకు అద్భుతమైన పరిష్కారం

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *