E panchayat” శంకరపట్నం, డిసీ ప్రతినిధి:
శంకరపట్నం మండలంలోని ఈ-పంచాయతీల్లో కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఉద్యోగ భద్రత కోసం మద్దతు కోరుతూ ఎంపీడీవో కృష్ణ ప్రసాద్, ఎంపీఓ ప్రభాకర్ కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మండల అధ్యక్షుడు గుర్రం అనుదీప్ మాట్లాడుతూ.. కొంతకాలంగా పంచాయతీల్లో పూర్తి సమయ ఉద్యోగుల్లా పనిచేస్తున్నా కూడా ప్రభుత్వాలు తమ సమస్యలపై ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం రూ.22,750 వేతనం ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం రూ.19,500 మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే తమ సమస్యల పరిష్కారార్థం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు హైదరాబాద్‌లోని పంచాయతీరాజ్ కమిషనరేట్ కార్యాలయానికి వెళ్లేందుకు ఒక రోజు అనుమతి ఇవ్వాలని ఎంపీడీవోను కోరినట్లు తెలిపారు.
ఈ వినతి కార్యక్రమంలో కంప్యూటర్ ఆపరేటర్లు నాంపల్లి వెంకటేష్, గొడిశాల శ్రీనివాస్, గుర్రం స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
