SI Shekhar Reddy ” వాగులు, వంకల వద్ద అప్రమత్తంగా ఉండాలి – ఎస్సై శేఖర్ రెడ్డి సూచన

Si Shekar”  శంకరపట్నం, డిసీ ప్రతినిధి:
భారీ వర్షాల సమయంలో వాగులు, వంకల వద్ద ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేశవపట్నం ఎస్సై కటుకూరి శేఖర్ రెడ్డి సూచించారు. శంకరపట్నం మండల పరిధిలోని ఆర్కండ్ల వాగు ప్రాంతాన్ని ఆయన బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎస్సై శేఖర్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘వర్షాకాలంలో వాగులు, వంకల్లో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. ప్రజలు అత్యవసరంగా ప్రయాణాలు చేయవలసిన సమయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రమాద పరిస్థితుల్లో వెంటనే 100 నంబరుకు డయల్ చేస్తే పోలీస్ శాఖ తక్షణ సహాయాన్ని అందిస్తుంది’’ అని చెప్పారు.

మండలంలోని అన్ని గ్రామాల్లోని ప్రజలు వర్షాల తీవ్రతను గమనించి, వాగులు దాటే ముందు నీటి ప్రవాహాన్ని తప్పకుండా పరిశీలించాలి. నిర్లక్ష్యం వలన ప్రాణహాని సంభవించే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో కేశవపట్నం పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

బ్యాల్కనీకి అందం, ఇంటికి ఆకర్షణ!
Solimo 5 ఇంచుల Flower Pots – Set of 5
Terrace | Balcony | Office | Indoor Plants
స్టయిలిష్ & స్టడీ డిజైన్ – ఇంటి డెకర్‌కి పర్ఫెక్ట్
Affordable Price | Amazon Trusted Brand
Terrace గార్డెనింగ్ కోసం బెస్ట్ ఛాయిస్!

ఇప్పుడు ఆర్డర్ చేయండి & మీ ఇంటిని గ్రీన్ చేస్తూ క్లాస్ లుక్ తీసుకురండి!
https://amzn.to/4o0MVWoకొనుగోలు కోసం లింక్ పై క్లిక్ చేయండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *