Heart Attack” షటిల్ ఆడుతూ కుప్పకూలిన 25 ఏళ్ల యువకుడు మృతి ఘటన వీడియో వైరల్

 

హైదరాబాద్‌లోని నాగోల్ స్టేడియంలో షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతున్న సమయంలో 25 ఏళ్ల యువకుడు హఠాన్మరణం చెందాడు. ఈ ఘటనకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

‍♂️ మృతుడు వివ‌రాలు..?
మరణించిన వ్యక్తిని గుండ్ల రాకేష్గా గుర్తించారు. ఆయన ఖమ్మం జిల్లా తల్లాడ మండలం చెందిన మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడు. రాకేష్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

ఘటన ఎలా జరిగింది?
జూలై 27 (ఆదివారం) రాత్రి 8 గంటల సమయంలో, నాగోల్ స్టేడియంలో షటిల్ డబుల్స్ గేమ్ ఆడుతుండగా రాకేష్ షటిల్ తీసేందుకు వంగిన క్షణాల్లోనే అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. తోటి ఆటగాళ్లు వెంటనే సహాయం అందించేందుకు పరుగెత్తారు.
వీరిలో ఒకరు హృదయ స్పందన కోసం చెస్ట్ కంఫ్రెషన్స్ కూడా చేశారు. అనంతరం రాకేష్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ వైద్యులు మృతి చెందాడ‌ని అని ధృవీకరించారు.

ఆరోగ్యంపై ఆందోళనలు:
ఇటువంటి సంఘటనలు తాజాగా ఎక్కువవుతున్న నేపథ్యంలో, యువతలో గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి అనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఆరోగ్య నిపుణులు హృదయ సంబంధిత సమస్యలు ముందుగానే గుర్తించేందుకు నిరంతర వైద్య తనిఖీలు, జీవనశైలి మార్పులు అవసరమని హెచ్చరిస్తున్నారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *