#OperationMahadev,
జూలై 28, 2025
️ ప్రత్యేక ప్రతినిధి నివేదిక
శ్రీనగర్: పహల్గాం (Pahalgam Terror Attack ) ఉగ్రదాడి వెనుకనున్న ప్రధాన సూత్రధారి సులేమాన్ హతమైనట్లు భద్రతా అధికారులు ధృవీకరించారు. జమ్మూ & కాశ్మీర్‌లోని లిద్వాస్ ప్రాంతంలో భారత భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ మహాదేవ్ విజయవంతమైంది. ఈ ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో లష్కరే తోయిబా కి చెందిన సులేమాన్, అబూ హమ్జా, యాసిర్ ఉన్నారు.
పహల్గాం దాడి నేపథ్యం:
2025 ఏప్రిల్ 22న పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దాడికి గల ప్రధాన కారణాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో, దాని సూత్రధారిగా Suleman Killed సులేమాన్ గుర్తించబడ్డాడు.
ఆపరేషన్ మహాదేవ్ వివరాలు:
ఇప్పటికే చినార్ కార్ప్స్ అధికారిక X ఖాతా ( Twitter) ద్వారా సమాచారం వెలువడింది.
“లిద్వాస్ ప్రాంతంలో భద్రతా బలగాలు ఆపరేషన్ మహాదేవ్ ప్రారంభించాయి. ముగ్గురు ఉగ్రవాదులు మట్టు బెట్టబడ్డారు. భారీ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆపరేషన్ కొనసాగుతోంది,” అని ఆర్మీ ట్వీట్ చేసింది.
రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన:
ఈ విజయవంతమైన ఆపరేషన్ జరుగుతుండగానే, పార్లమెంటులో ఆపరేషన్ సిందూర్ పై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “దేశ భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం. ఉగ్రవాదాన్ని బట్టి తుడిచేస్తాం,” అని వ్యాఖ్యానించారు.
ప్రజల నుంచి ప్రశంసలు:
భద్రతా బలగాల ఈ విజయానికి దేశవ్యాప్తంగా ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో #OperationMahadev అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.
OP MAHADEV
Contact established in General Area Lidwas. Operation in progress.#Kashmir@adgpi@NorthernComd_IA pic.twitter.com/xSjEegVxra
— Chinar Corps – Indian Army (@ChinarcorpsIA) July 28, 2025
మీ హోమ్ ఎంటర్టైన్మెంట్ను Level Up చేయండి!
ఇది ఉంది – Xiaomi 80cm (32″) HD Ready Smart Fire TV
HD Ready Resolution (1366 x 768) | 60Hz Refresh Rate
2 HDMI, 2 USB, Bluetooth, Wi-Fi
20W Speaker Output | Dolby Audio | DTS Virtual:X
సినిమాలు, వెబ్ సిరీస్‌లు, గేమ్స్ అన్నీ ఒక్కటే స్క్రీన్‌లో!
️ Alexa Built-in – వాయిస్‌తోనే నియంత్రించండి!
Style, Sound, Smartness – అన్నీ ఓ టీవీలో!
https://amzn.to/457Zsi4అమెజాన్‌లో కొనేందుకు లింక్ పై క్లిక్ చేయండి
