Health Team” కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు
శంకరపట్నం, డిసీ ప్రతినిధి:
ఇటీవల గుండెపోటుతో అకాల మరణం చెందిన ఆశ కార్యకర్త మాతంగి భాగ్యలక్ష్మి కుటుంబానికి మండల వైద్య బృందం ఆర్థిక సహాయం అందించింది. ఈ మేరకు కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండల వైద్య అధికారి డా. గొట్టే శ్రావణ్ కుమార్ బుధవారం వెల్లడించారు.
రాజాపూర్ గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ విషాద సందర్భంలో మండల వైద్యశాఖ ఆధ్వర్యంలో సిబ్బంది సొంతంగా సేకరించిన రూ.51,500 ను ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. దీంతో వారు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల కేంద్రంలోని వైద్యశాల సిబ్బంది, ఆరోగ్యశాఖ అధికారులు, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సహాయాన్ని అందించిన వైద్య బృందానికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

వర్షాల కోసం … కేవలం రూ. 215
మెన్ & ఉమెన్ కోసం యూనిసెక్స్ రెయిన్ కోట్
వాటర్‌ప్రూఫ్, రీయూసబుల్, లైట్‌వెయిట్
ఫ్యాషనబుల్ & యూనివర్సల్ సైజ్
కేవలం ₹215 మాత్రమే! (37% తగ్గింపు)
1K+ మంది గత నెలలో కొనుగోలు చేశారు!
ఇప్పుడే ఆర్డర్ చేయండి! https://amzn.to/4ohNETq లింక్ పై క్లిక్‌చేసి అమెజాన్‌లో కొనుగోలు చేయండి..
