Russia Earthquake” రష్యా ఫార్ ఈస్ట్‌ను బుధవారం ఉదయం 8.8 తీవ్రత గల భారీ భూకంపం కుదిపేసింది. కామ్చాట్కా ద్వీపకల్పం సమీపంలో కేంద్రబిందువుతో సంభవించింది. ఈ భూకంపం పసిఫిక్ మహాసాగర అంతటా సునామీని రేకెత్తించింది. తీర ప్రాంతాల్లో భారీ నష్టం సంభవించగా, ప్రజలు తీవ్ర గందరగోళానికి గురయ్యారు.
అయితే భూమి కంపిస్తున్న సమయంలోనూ ఓ అద్భుతమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ దవాఖానాలో వైద్య బృందం ఒక పేషంట్‌కు ఆపరేషన్ చేస్తున్నది. ఈ క్రమంలో భారీ భూకంపంతో మొత్తం దవాఖానా బిల్డింగ్ ఊగిపోయిది. అయినప్పటికీ వైద్యులు ఓ ఆపరేషన్‌ను నిలిపివేయకుండా పేషంట్ కిందపడిపోకుండా గట్టిగా పట్టుకున్నారు. అదే సమయంలో సర్జీరీ పూర్తి చేశారు. రష్యన్ వైద్య బృందానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
రష్యా రాష్ట్ర టెలివిజన్ నెట్వర్క్ “Russia Today (RT)” తన ఎక్స్ ( ట్విట్టర్) ఖాతా ద్వారా పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వీడియోలో ఓ సర్జరీ జరుగుతుండగా, భూకంపం సంభవిస్తుంది. ఆసుపత్రి గది బాగా కంపించిపోతున్నా, వైద్యులు ఎంతమాత్రం భయపడకుండా ఆపరేషన్‌పై తమ దృష్టిని నిలుపుతారు. ఒకరు వెంటనే ఆపరేషన్ బెడ్‌కి చేరి, రోగిని చక్కగా పట్టుకుని కాపాడే ప్రయత్నం చేస్తారు. మొత్తం టీం రోగిని చుట్టూ గుంపుగా నిలబడి, భూకంపం ఆగే వరకు అప్రమత్తంగా ఉంటారు. చివరికి ఆపరేషన్ విజయవంతంగా పూర్తవుతుంది.
ఈ ఘటన పట్ల ప్రపంచవ్యాప్తంగా మెచ్చుకుంటున్నారు. “ఇది నిజమైన సేవాభావానికి నిదర్శనం”, “ప్రాణాలతో పోరాడుతున్న వేళ వైద్యులు చూపిన అంకితభావం అద్భుతం” అనే వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి.
వీడియో కింద ప్లే అవుతున్నది చూడండి..
EXTRAORDINARY: Amid intense tremors from the recent earthquake in Russia, surgeons at the Kamchatka Oncology Center heroically continued a critical operation. The Ministry of Health confirms the patient’s condition remains stable. pic.twitter.com/EK40SMqZTk
— Global Report (@Globalrepport) July 30, 2025

వర్షాల కోసం … కేవలం రూ. 215
మెన్ & ఉమెన్ కోసం యూనిసెక్స్ రెయిన్ కోట్
వాటర్‌ప్రూఫ్, రీయూసబుల్, లైట్‌వెయిట్
ఫ్యాషనబుల్ & యూనివర్సల్ సైజ్
కేవలం ₹215 మాత్రమే! (37% తగ్గింపు)
1K+ మంది గత నెలలో కొనుగోలు చేశారు!
ఇప్పుడే ఆర్డర్ చేయండి! https://amzn.to/4ohNETq లింక్ పై క్లిక్‌చేసి అమెజాన్‌లో కొనుగోలు చేయండి..
