Ration Card Distribution” నాడు రీసైకిలింగ్, కోళ్ల దానాకు.. నేడు ప్రతి ఇంట సన్న బియ్యం

నేడు ప్రతి ఇంట సన్న బియ్యం బువ్వ అందిస్తున్న ప్రజా ప్రభుత్వం..
దేశంలో ఎక్కడలేని సంక్షేమ పథకం సన్నబియ్యం పథకం తెలంగాణలో…
నాటి టిఆర్ఎస్ ,బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క కార్డు లేదు..
పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి..
శంకరపట్నం డిసీ ప్రతినిధి
నాడు టిఆర్ఎస్ బిఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలుపు రేషన్ కార్డుల పై పంపిణీ చేసిన దొడ్డు బియ్యం రీసైకిలింగ్ దందా, కోళ్ల ఫార్ములా కు కోళ్ల దానాకు 75% పేద ప్రజలు విక్రయించిన సందర్భం ఉందని తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో, శంకర పట్నం మండలం, కేశవపట్నం శ్రీ వెంకటేశ్వర గార్డెన్ అండ్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జ్ మంత్రి, తుమ్మల నాగేశ్వరరావు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, బిసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజర‌య్యారు.

నూతన రేషన్ కార్డు లబ్ధిదారులకు కార్డుల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హాయంలో రెండు కోట్ల 81 లక్ష మందికి దొడ్డు బియ్యం అందిస్తే నేడు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రివర్గం ఎమ్మెల్యేలు దేశంలో ఎక్కడలేని సంక్షేమ పథకాన్ని తెలంగాణలో ప్రవేశపెట్టి నేడు మూడు కోట్ల 17 లక్షల మందికి సన్నబియ్యాన్ని అందిస్తున్న‌ట్టు తెలిపారు. టిఆర్ఎస్‌/ బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో అర్హులైన పేదలకు, ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవని ఆరోపించారు.

నేటి ప్రజా ప్రభుత్వంలో అర్హులైన పేదలందరికీ కలసాకారం చేసేందుకు నూతన రేషన్ కార్డులతో పాటు, రేషన్ కార్డులలో నూతన పేర్లను చేర్చి అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహన్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా కమిషనర్ గౌడ్ అలం, సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజ వాకేడి, త‌హ‌సిల్దార్ కే సురేఖ, ఎంపీడీవో గోల్కొండ కృష్ణ ప్రసాద్, మాజీ జెడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్‌, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్ హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి, కొత్తగట్టు మచ్చ గిరింద్ర స్వామి దేవస్థానం చైర్మన్ కోరెం రాజిరెడ్డి, మాజీ చైర్మన్ ఉప్పుగల్లు మల్లారెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆడెపు అజయ్, మానకొండూరు నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మహమ్మద్ షారుక్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, మహిళా సంఘాల ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, రేషన్ కార్డుల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

 

Freedom Sale లో హవెల్స్ ఫ్యాన్ సూపర్ ఆఫర్!
Havells 1200mm Elio Prime BLDC Ceiling Fan – Slate Mist Grey

రిమోట్ కంట్రోల్ తో
హై ఎయిర్ డెలివరీ
⚡ 60% వరకు పవర్ సేవింగ్!
⭐ 5 Star Rated
️ 2+1 సంవత్సరాల వారంటీ

గత నెలలో 100+ కొనుగోలు
⭐ రేటింగ్: 3.9/5 (859 రివ్యూస్)

ఇప్పుడు కేవలం ₹3,499 మాత్రమే! (52% తగ్గింపు)

లింక్ పై క్లిక్ చేసి https://amzn.to/4ohoW5h అమెజాన్‌లో కొనుగోలు చేయండి..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *