కరీంనగర్ |
కరీంనగర్ జిల్లా 3 మున్సిపాలిటీలు మరియు కరీంనగర్ కార్పొరేషన్‌లో మహిళా రిజర్వేషన్ వార్డులను లాటరీ పద్ధతిలో ఖరారు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ పమేలా సత్పతి ప్రకటించారు.
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, మున్సిపల్ వార్డులలో మహిళలకు రిజర్వేషన్ కేటాయింపు ప్రక్రియ శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో, వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో నిర్వహించబడింది.
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ, “మున్సిపల్ వార్డులలో మహిళా రిజర్వేషన్ కేటాయింపు ప్రక్రియను పారదర్శకంగా, లాటరీ పద్ధతిలో పూర్తి చేశాం” అని తెలిపారు.
హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలలో మరియు కరీంనగర్ కార్పొరేషన్‌లో ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ వర్గాల మహిళలకు కేటాయించబడ్డ వార్డుల వివరాలను కూడా లాటరీ పద్ధతిలో ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపోల్ దేశాయ్, రాజకీయ పార్టీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
