RajivYuvaVikasam” రాజీవ్ యువ వికాసం పథకం పట్ల నిర్లక్ష్యం: టిడిపి నేత ప్రభాకర్ హెచ్చరిక

RajivYuvaVikasam” శంకరపట్నం (డిసీ ప్రతినిధి):
రాజీవ్ యువ వికాసం పథకం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని టిడిపి కరీంనగర్ పార్లమెంట్ హడక్ కమిటీ సభ్యులు మోరె ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు.

సోమవారం శంకరపట్నం మండలంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ,

“కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన విధానం మంచిదే అయినా, అమలులో పూర్తిగా విఫలమైంది. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా ఒక్క నిరుద్యోగుడికీ సహాయం చేయలేదు,” అని అన్నారు.

ప్రభుత్వ ప్రకటనల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 16 లక్షల మంది నిరుద్యోగులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నప్పటికీ, చర్యలు గోసుకోకుండా ఆగిపోయాయని విమర్శించారు. పథకాన్ని స్థానిక సంస్థల ఎన్నికల ముందే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

“లేకపోతే టిడిపి పార్టీ నిరాహార దీక్షలు, నిరుద్యోగులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలకు సిద్ధమవుతుంది,” అని హెచ్చరించారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి వంటి హామీలు పూర్తిగా విస్మరించిందని గుర్తు చేశారు.

“నిరుద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాలను తారుమారు చేయగలరని చరిత్ర చెబుతుంది,” అంటూ వ్యాఖ్యానించారు.

పథకాన్ని వెంటనే ప్రారంభించి, నిజమైన అర్హులకే లబ్ధి అందేలా చూడాలని కోరారు. త్వరలోనే టిడిపి తన భవిష్యత్ పోరాట కార్యాచరణను ప్రకటిస్తుందన్నారు.

T2F Boy's Cotton Printed Regular Fit T-Shirt (Pack 0f 5)

ఫ్రీడమ్ సేల్ స్పెషల్ – ఫ్యాషన్ ఫుల్ ఆఫర్!

70% డిస్కౌంట్ తో 5 టి-షర్ట్స్ కేవలం ₹549 కి!

ఒక్కో షర్ట్ ₹109.80 మాత్రమే!
స్టయిలిష్ ప్రింటెడ్ డిజైన్లు
పిల్లలకే కాదు – స్టైల్ కి హక్కు అందరికీ!

️ Freedom Sale లో బంపర్ ఆఫర్లు మిస్ అవ్వకండి!

https://amzn.to/4muGycv  లింక్ పై క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *