Local News” 03.05.2025 శంక‌ర‌పట్నం వార్త‌లు

Local News”  తాసిల్దార్ కు శుభాకాంక్షలు తెలిపిన జన సమితి, తెలుగుదేశం పార్టీ నాయకులు…
శంకరపట్నం డిసి ప్రతినిధి


తాసిల్దారుగా బాధ్యతలు స్వీకరించిన శంకరపట్నం తాసిల్దార్ కు జన సమితి తెలుగుదేశం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపినట్లు నాయకులు మోరె గణేష్ , మోరె ప్రభాకర్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా గణేష్, ప్రభాకర్ మాట్లాడారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం తాసిల్దార్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తాసిల్దార్ గట్ల రమేష్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో, డిప్యూటీ తాసిల్దార్ పార్థసారథి, కార్యాలయం సిబ్బంది, సామాజిక కార్యకర్త మావునూరి గణేష్, నాయకులు గాజుల శ్యామ్, తదితరులు పాల్గొన్నారు .

/////////////////////////////////////////////////////////////////////////////

కులగణన చేయడం హర్షించదగిన విషయం..
మోడి చిత్రపటానికి కృతజ్ఞతగా పాలాభిశేకం చేసిన బిజేపి నాయకులు..
శంకరపట్నం డిసి ప్రతినిధి


భారత దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణనకు మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకోవడం పట్ల శంకరపట్నం మండల బిజెపి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు ఎనుగుల అనిల్ ఆద్వర్యంలో శుక్ర‌వారం ప్రధానమంత్రి నరేంద్రమోడి చిత్రపటానికి పాలాభిశేకం చేశారు. అనంతరం బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. బుదవారం రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో, జనాభా లెక్కలతోపాటే కులగణనను నిర్వహించాలని తీర్మానించడం హర్షించదగిన విషయం అన్నారు. 2010లో కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనే నాటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ కి బిజెపి ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ కులగణనకు అనుకూలంగా లేఖ రాశారని తెలిపారు. అప్పటి హోంమంత్రి చితంబరమే కులగణనను వ్యతిరేకించారని, అప్పటి నుండే జనగణనతోనే కులగణన చేస్తామని సుష్మాస్వరాజ్ లేఖ ఆదరంగానే నేటి ప్రకటన అని అమిత్ షా తెలిపారని, రాజకీయ దురుద్దేశంతోనే ప్రతిపక్షాలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, కర్ణాటకల్లో కులగణన తప్పుల తడకగా లెక్కలు చేసి మళ్లీ లెక్కిస్తామని ప్రకటన చేసిన కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఈ అంశాన్ని విస్మరించిందని, అధికారం పోయాక విమర్శలు చేస్తుంది తప్ప వారికి కులగణన పట్ట చిత్తశుద్ధి లేదని, మోదీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా బీసీ, ఎస్సి, ఎస్టిలతో పాటు అన్ని వర్గాలవారు అందరూ స్వాగతిస్తున్నారని అన్నారు. ఈ కులగణణతో సమ్మిళిత వృద్ధి వేగం గా పుంజుకుంటుందని, ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఈ సందర్భంగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం చేశారు. ఈ కార్యక్రమంలో బిజేపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు కొమురయ్య, నాయకులు దొంగల రాములు, దాసారపు నరేందర్, రాసమల్ల శ్రీనివాస్, కనకం సాగర్, బిజిలి సారయ్య, పల్లె శివారెడ్డి, చెర్ల శ్రీనివాస్, గూళ్ళ రాజు, మందాడి జగ్గారెడ్డి, సుదగోని శ్రీనివాస్, బొజ్జ సాయి ప్రకాష్, వడ్లకొండ రాజేందర్, కనకం కుమార్, మొల్గూరి రాములు తదితరులు పాల్గొన్నారు.

///////////////////////////////////////////////////////////////

చెంతకు వస్తా చింతలు తీరుస్తా..
ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి..
ఆలోచన అద్భుతం: సిద్ధిపేట జిల్లా కలెక్టర్ మనూ చౌదరి..
శంకరపట్నం డిసీ ప్రతినిధి


సమస్యలు పరిష్కారం కావడంలేదని చింత పడవద్దని, ఇకనుంచి ప్రజల వద్దకే వచ్చి సమస్యలు తీరుస్తానని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. బెజ్జంకి మండల కేంద్రంలో ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన నిర్వహించారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనో చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. గ్రామాలకే వెళ్లి సమస్యలు పరిష్కరించాలన్న ఉద్దేశంతోనే ఎమ్మెల్యే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు ఆయన వివరించారు. సమస్యలు చెప్పుకోవడానికి వెళ్లకుండా ప్రత్యేకంగా రూపొందించిన యాప్ లో సమస్యలను నమోదు చేస్తే మీ గ్రామానికి వచ్చి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ అవకాశాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి కోరారు. అభివృద్ధి పనులకు సంబంధించి అడిగిన తట్టుకోగానే నిధులు మంజూరు చేస్తున్నారని ఆయన కొనియాడారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి అభివృద్ధికి ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమం దోహదపడు తుందని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలు వినడానికి వాటిని పరిష్కరించడానికి నేను సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. వారానికి మూడు రోజులు గ్రామాల్లో పర్యటిస్తే సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు.
సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనూ చౌదరి మాట్లాడుతూ ప్రజలకు చేరువ కావాలన్న ఆలోచన అద్భుతమని ఇందుకు అనుగుణంగా ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని చేపట్టిన డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణను అభినందించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో భూ సమస్య కీలకంగా మారిందని ఆయన పేర్కొన్నారు. భూ సంపస్యలకు భూభారతి చట్టంతో పరిష్కారాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. భూభారతి చట్టంపై అవగాహన కల్పించామన్నారు భూ రికార్డుల సవరణ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యానికి ఆదరణ లభిస్తుందని అంతేకాకుండా ప్రజలు నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని తినగలుగుతున్నారని, దీంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతాయని కలెక్టర్ చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పదవ తేదీలోగా సాంక్షన్ ప్రొసీడింగ్స్ ఇస్తామని ఆయన చెప్పారు. ఎస్సీలకు అసైన్మెంట్ భూముల పంపిణీ కోసం ప్రతిపాదనలు పంపించాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, తాసిల్దార్, వివిధ శాఖల అధికారులతో పాటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దామోదర్, బెజ్జంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు రత్నాకర్, రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ పోతరవేణి పోచయ్య ముదిరాజ్, పార్టీ నాయకులు బైరి సంతోష్, చెప్యాల శ్రీనివాస్ గౌడ్,జనగామ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *