Shankarapatnam” శంకరపట్నం డిసీ ప్రతినిధి
ప్రభుత్వ వైద్య సేవలను మండల ప్రజలు వినియోగించుకొని ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందుతూ ఆర్థికంగా ఎదగాలని తహసిల్దార్ కే సురేఖ మండల ప్రజలకు సూచించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండల కేంద్రంలోని కేశవపట్నం రైతు వేదికలో మండల వైద్య అధికారి గొట్టి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం జాతీయ నూలు పురుగు నివారణ దినోత్సవ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన తహసిల్దార్ సురేఖ మాట్లాడుతూ . ప్రభుత్వ దవాఖానాలను కార్పేరట్ రేట్ వైద్య శాలల మాదిరిగా సకల సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. మండల ప్రజలు ప్రభుత్వ వైద్యశాలల సేవలను వినియోగించుకుని, ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందుతూ ఆర్థిక ఎదగాలని సూచించారు. వైద్య అధికారి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. 1 సంవత్సరం నుండి19 సంవత్సరాల వయస్సు కలిగిన బాల బాలికల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వైద్య సేవలు అందజేస్తూ బాలబాలికల ఆరోగ్యమే లక్ష్యంగా మండల పరిధిలో సేవలందిస్తున్నట్లు పేర్కొన్నారు.
జాతీయ నూలు పురుగు నివారణ దినోత్సవం పురస్కరించుకొని మండలంలో ఆగస్టు 11న, లేదా 19న కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు.
మండల ప్రజలు ప్రభుత్వ వైద్యశాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గోల్కొండ కృష్ణ ప్రసాద్, సిడిపిఓ శ్రీమతి, ఎంఈఓ లక్ష్మీనారాయణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, అంగన్వాడి సూపర్వైజర్లు అరుణ, పద్మ, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

అమెజాన్‌లో కొనేందుకు https://amzn.to/3JiShMGలింక్ పై క్లిక్ చేయండి.
