Crpf Bus” లోయ‌లో ప‌డిపోయిన జ‌వాన్ల బ‌స్సు.. ముగ్గురు మృతి.. 15 మందికి గాయాలు

Crpf Bus”  జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో జరిగిన ఘోర ఘ‌ట‌న చోటు చేసుకుంది. 187వ బెటాలియన్‌కు చెందిన సిబ్బందిని తీసుకెళ్తున్న వాహనం కంద్వ ప్రాంతంలో రోడ్డుపై నియంత్రణ కోల్పోయి లోయ‌లో ప‌డిపోయింది. ఈ సీఆర్‌పీఎఫ్ (CRPF) జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో 15 మంది జవాన్లు గాయపడ్డారు.

ఈ జవాన్లు బసంత్‌గఢ్ ప్రాంతంలో నిర్వహించిన ఆపరేషన్‌ తర్వాత తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక అధికారులు, రక్షణ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇప్పటికే మృతుల వివరాలు గుర్తించబడి ఉండగా, గాయపడిన వారి పరిస్థితిపై అధికారులు వివరాలు అందించనున్నారు. ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

 

అమెజాన్‌లో మ‌రిన్ని వివ‌రాల‌కు లింక్ పై క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *