Icds awareness” తల్లిపాల ద్వారా బిడ్డకు రోగ నిరోధక శక్తి…
సిడిపిఓ శ్రీమతి..
శంకరపట్నం డిసీ ప్రతినిధి
తల్లిపాలు బిడ్డకు ఆరోగ్యం తల్లి పాలతో బిడ్డకు రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆఫీసర్ శ్రీమతి అన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలం, కేశవపట్నం రైతు వేదికలో గురువారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సిడిపిఓ శ్రీమతి మాట్లాడుతూ.. పుట్టిన బిడ్డకు తల్లిపాలు 6 నెలల వరకు క్రమం తప్పకుండ అందజేయాలన్నారు. బిడ్డ ఆరు నెలల వయసు తర్వాత తల్లిపాలతో పాటు, పోషక విలువలు కలిగిన కలిగిన ఆహారాన్ని అందజేసి బిడ్డ ఆరోగ్యం కోసం తల్లి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల విలువలపై తల్లులకు అవగాహన కల్పించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ కే సురేఖ, ఎంపీడీవో గోల్కొండ కృష్ణ ప్రసాద్, మండల వైద్య అధికారి గొట్టే శ్రావణ్ కుమార్, మండల విద్యాధికారి లక్ష్మీనరాయణ, సిహెచ్వో భాస్కర్, అంగన్వాడి సూపర్వైజర్లు అరుణ, పద్మ, అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు , పిల్లల తల్లులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

అమెజాన్లో మరిన్ని వివరాలకు లింక్ పై క్లిక్ చేయండి https://amzn.to/4opK6yn
