Former ZPTC Srinivas Goud” గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం…

Former ZPTC Srinivas Goud” సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి..
టీపీసీసీ సభ్యులు మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ గౌడ్..
శంకరపట్నం : డిసీ ప్రతినిధి
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని శంకరపట్నం మాజీ జెడ్పిటిసి టిపిసి సభ్యులు బత్తిని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండలంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పనుల జాతర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల స్థాయి అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరై మాట్లాడారు. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వము గత సంవత్సరములు గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు విడుదల చేసి అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరము గ్రామాల్లో చేపట్టబోయే పలు అభివృద్ధి పనుల కార్యక్రమాలకు, పనుల జాతరలో భాగంగా రాజాపూర్, గుడాటి పల్లె, మెట్ పల్లి ,లింగాపూర్, తాడికల్, మొలంగూర్, గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శంకరపట్నం మండలంలోని అన్ని గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వము ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నిధులు విడుదలచేయడం జరుగుతుందని,
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని గ్రామాలతో పాటు కుటుంబార్దిక ఎదుగుదలకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి భూక్య హుక్య నాయక్, ఎంపీడీవో గోల్కొండ కృష్ణ ప్రసాద్, ఎంపీఓ కాసగోని ప్రభాకర్, స్వచ్ఛభారత్ జిల్లా ప్రతినిధులు రమేష్, వేణు, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గోపగోని బసవయ్య, గ్రామాల ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, గౌడ్, మెట్ పల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు గొట్టే మధు, తడిసిన నారాయణరెడ్డి, ఆయా గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

శుభ కార్యాల అందానికి శోభాయమాన అలంకరణ!

పూజా గది, గణేశ్ చతుర్థి, నవరాత్రి, శ్రీకృష్ణ జన్మాష్టమి, దీపావ‌ళి,
వంటి పర్వదినాల్లో మన గృహాన్ని అలంకరించేందుకు ఇప్పుడు కొత్త అద్భుతం!

✨ Divyakosh Lotus Hanging – 6 పీసెస్ – 16 అంగుళాలు
డోర్ హ్యాంగింగ్స్, వాల్ డెకోరేషన్ – హస్తకళతో తయారు చేసిన భారతీయ శిల్పకళకు ప్రతిరూపం!
Amazon’s Choice | ⭐ 4.3 రేటింగ్ | 900+ సంతృప్తి చెందిన ఖాతాదారులు
MRP ₹1583 → ఇప్పుడు కేవలం ₹475 (70% తగ్గింపు‼️)

ప్యాక్ లో: 6 పీసెస్, ప్రతి ఒక్కటి 16 అంగుళాల సైజ్ లో
ఇంటి అలంకరణకి, దేవాలయ మంటపాలకి, ఫెస్టివల్ డెకోరేషన్ కి పర్ఫెక్ట్!

ఇప్పుడు ఆర్డర్ చేయండి https://amzn.to/3UBQO6R లింక్ పై క్లిక్ చేయండి..

️ ఈ దీపావళి మీరు చేసే అలంకరణ, అందరినీ ఆకట్టుకుంటుంది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *