Bjp” స్థానిక సమస్యలపై నిరంతర పోరుకు సిద్ధమంటున్న బీజేపీ
శంకరపట్నం: డీసీ ప్రతినిధి
శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మండల బీజేపీ అధ్యక్షుడు ఎనుగుల అనిల్ విమర్శించారు. సోమవారం ఆయన ఆధ్వర్యంలో శంకరపట్నం మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా నుండి మండల పరిషత్ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించి, ప్రజా సమస్యలపై అధికారులను ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి, అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి తదితరులు మాట్లాడుతూ, మండలంలోని పలు ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ప్రధాన డిమాండ్లు:
-
అంబేద్కర్ విగ్రహం నుండి కరీంపేట వరకు రోడ్డు వెడల్పు పనులు ప్రారంభించాలి.
-
కన్నాపూర్, రాజాపూర్, కాచాపూర్, గద్దపాక గ్రామాల బీటీ రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలి.
-
కన్నాపూర్ నుండి అర్కండ్ల వరకు వాగుపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం తక్షణమే ప్రారంభించాలి.
-
కేశవపట్నం – పాపాయపల్లి – ఎగ్లాస్పూర్, ముత్తారం – ఎరడపల్లి, లింగాపూర్ – పోతిరెడ్డిపేట, గుడాటిపల్లి – మెట్పల్లి వరకు బీటీ రోడ్లను నిర్మించాలి.
-
అసంపూర్తిగా ఉన్న అరుంధతి కళ్యాణ మండపం నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలి.
-
వర్షాకాలం దృష్ట్యా పారిశుద్ధ్య కార్యక్రమాలు, క్లోరినేషన్, దోమల మందు పిచికారీ వంటి చర్యలు తీసుకోవాలి.
అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని, లేకపోతే మండలంలోని గ్రామాల్లో మరింత వ్యాప్తిలో నిరసనలు చేపడతామని నేతలు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు కొమురయ్య, నాయకులు దొంగల రాములు, జంగ జైపాల్, దాసారపు నరేందర్, రాస మల్ల శ్రీనివాస్, కనకం సాగర్, బిజిలి సారయ్య, పడాల వెంకటలక్ష్మి, ఇతర మోర్చాల నాయకులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇంటి థియేటర్ ఫీల్!
TCL 55″ 4K QLED Google TV తీసేసా!
MRP: ₹1,09,990
➡️ డీల్లో కేవలం ₹40,990కి (63% తగ్గింపు!)
4K QLED | 120Hz Refresh Rate | Dolby Atmos
గేమింగ్ కోసం 288Hz Game Accelerator
️ 2 ఏళ్ల వారంటీ + Free Open Box Inspection
ఇంట్లోనే సినిమాల థియేటర్ ఫీల్!
ఎవరు అయినా TV తీసుకోవాలంటే… అమెజాన్లో కొనేందుకు
లింక్ https://amzn.to/4fvc9Z7పై క్లిక్ చేయండి
