Chalo Hyderabad” శంకరపట్నం: డిసీ ప్రతినిధి:
“హలో ముదిరాజ్ – చలో హైదరాబాద్” కార్యక్రమానికి మానకొండూర్ నియోజకవర్గం నుండి వాహనాల్లో పెద్ద సంఖ్యలో ముదిరాజ్ కులస్తులు హాజరయ్యారు అని నియోజకవర్గ ఇన్చార్జ్ కీసర సంపత్ మంగళవారం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మేడ్చల్ జిల్లాలోని కొంపల్లి నిర్మల గార్డెన్స్‌లో జరిగిన తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి ఆవిర్భావ సభకు మానకొండూర్ నియోజకవర్గం నుండి బృందాలుగా తరలివెళ్లారని తెలిపారు. ఈ సభకు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీళ్ల మధు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కచనల మహేందర్, నియోజకవర్గ ఇన్చార్జ్ కీసర సంపత్ ఆధ్వర్యంలో భారీ రీతిలో ఏర్పాట్లు జరగగా, కరీంనగర్ జిల్లా అంతటినుండి ముదిరాజ్ సముదాయం పెద్ద ఎత్తున పాల్గొంది.
ఈ సభ ద్వారా ముదిరాజ్ కులస్తుల ఐక్యత, ప్రాధాన్యతను తెలియజేస్తూ, భవిష్యత్ రాజకీయ ప్రస్థానానికి దిక్సూచి ఏర్పాటు చేసేందుకు ఈ కార్యక్రమం మైలురాయిగా నిలుస్తుందని నేతలు పేర్కొన్నారు.
