Indira housing progress” ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయండి: అధికారులకు ఎమ్మెల్యే కవ్వంపల్లి ఆదేశాలు

Indira housing progress”

శంకరపట్నం: డిసీ ప్రతినిధి
మానకొండూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. మంగళవారం ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్‌లో ఆరు మండలాల ఎంపీడీవోలు, హౌసింగ్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మండలాల వారీగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ, లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారుల ఇళ్లను రద్దు చేసి, ఇతర అర్హులైన వారికి ఇవ్వాలన్నారు.

ఇళ్ల నిర్మాణాల పురోగతిని అధికారులు నిరంతరం పరిశీలిస్తూ, లబ్ధిదారులకు సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించారు.

ఈ సమావేశంలో ఎంపీడీవోలు వీవీ వరలక్ష్మి (మానకొండూర్), జి. కృష్ణప్రసాద్ (శంకరపట్నం), వి. సురేందర్ (తిమ్మాపూర్), డి. శ్రీనివాస్ (గన్నేరువరం), కె. ప్రవీణ్ (బెజ్జంకి), వై. శశికళ (ఇల్లంతకుంట)తో పాటు సంబంధిత హౌసింగ్ ఏఈలు, అధికారులు పాల్గొన్నారు.

✨ ఇప్పుడు లాండ్రీకి స్మార్ట్ సొల్యూషన్!
Haier 9 Kg, 5⭐ Front Load Washing Machine వచ్చేసింది!

AI Direct Motion
1400 RPM Speed
️ PuriSteam టెక్నాలజీ
స్వచ్ఛమైన క్లీనింగ్
14+ Wash Programs
️ 12yrs మోటార్ వారంటీ!

మీ ఇంట్లోకి తీసుకురావాలనుకుంటున్నారా?
#HaierSmartWash
అమెజాన్లో కొనేందుకు https://amzn.to/3Up0G3O లింక్ పై క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *