Kachapur” అనారోగ్య సమస్యతో వ్యక్తి ఆత్మహత్య…

Kachapur”  కాచాపూర్ గ్రామంలో విషాదం…
శంకరపట్నం :డిసి ప్రతినిధి:
అనారోగ్య సమస్యతో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కాచాపూర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..  కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండలంలోని కాచాపూర్ గ్రామానికి చెందిన తడిగొప్పుల పోచయ్య గత కొన్ని నెలల నుండి కడుపు నొప్పితో బాధపడుతున్నాడు, ఎన్ని ఆస్పత్రులు తిరిగిన కడుపునొప్పి తగ్గక రోజురోజుకు అనారోగ్యానికి గురైన పోచయ్య మనస్థాపానికి చెంది గురువారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకున్నాడు.   శుక్రవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు చూసి కేశవపట్నం పోలీసులకు సమాచారం అందించారు.  కేశవపట్నం పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజురాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు.  పోచయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయాలనుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *