Suravaram Sudhakar reddy” పేదల పెన్నిధి సుధాకర్ రెడ్డి సేవలు చిరస్మరణీయం..

Suravaram Sudhakar reddy”  సురవరం మరణం సిపిఐ పార్టీకి తీరని లోటు…
జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల కార్యదర్శి సమ్మయ్య..
శంకరపట్నం :డిసి ప్రతినిధి:
భారత కమ్యూనిస్టు పార్టీ పార్టీ జాతీయ నేత, పెద్దల పెన్నిధి సురవరం సుధాకర్ రెడ్డి సేవలు చిరస్మరణీయమని, సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండల కేంద్రంలో పార్టీ కార్యాలయంలో సూరవరం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి సమ్మయ్య మాట్లాడారు. సురవరం సుధాకర్ రెడ్డి విద్యార్థి దశ నుండే సిపిఐ పార్టీ అనుబంధ సంస్థ అయిన ఏఐఎస్ఎఫ్ నుండి ఒక కార్యకర్తగా తన పోరాటాన్ని ప్రారంభించి, ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసి, రెండుసార్లు ఎంపీగా , మూడుసార్లు జాతీయ ప్రధాన కార్యదర్శిగా దేశంలో ఎందరో నిరుపేదలకు సేవలు అందించి, భూములేని నిరుపేదలకు, సుధాకర్ రెడ్డి పోరాటంతో, భూములు పంచిన పేదల పెన్నిధి సురవరం సుధాకర్ రెడ్డి అని, ఆయన మృతి భారత కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటని సుధాకర్ రెడ్డి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి కన్నం సదానందం, బాదుల్లా, బిల్డింగ్ రాష్ట్ర కౌన్సిలర్ సభ్యులు రేగుల కుమార్, గ్రామ కార్యదర్శి పొనుగంటి శ్రీనివాస్, శంకరపట్నం ఆఫీస్ కార్యదర్శి గోదారి లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

 

 

✅ 750W Vega W5 మోటార్ – తుర్మరిక్ కూడా 2 నిమిషాల్లో పొడి!
✅ 5 జార్స్ – వంటకాలకు పూర్తి సపోర్ట్
✅ 3-ఇన్-1 ఇన్స్టా ఫ్రెష్ జ్యూసర్ జార్ – జ్యూస్, కోబ్బరి & చింతపండు ఎక్స్‌ట్రాక్షన్
✅ మాస్టర్ చెఫ్ ప్లస్ జార్ – చపాతీ మావు 1 నిమిషంలో, కటింగ్, గ్రేటింగ్, మిన్సింగ్ కూడా
✅ 5 సంవత్సరాల వారంటీ + లైఫ్ లాంగ్ ఫ్రీ సర్వీస్
✅ ఇండియా నంబర్ 1 మిక్సర్ బ్రాండ్!

ఇప్పుడు కేవలం ₹9,099/- కి
700+ మంది ఈ నెలలో కొనుకున్నారు!
No Cost EMI కూడా ఉంది – నెలకి ₹441/- నుండి

ఇంట్లో వంట పనులు ఈజీ చేయాలంటే – ఇది తప్పనిసరి!
అమెజాన్లో కొనేందుకు  https://amzn.to/4mWgOFR లింక్ పై క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *