Collector Orders” తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు మోరె గణేష్ హెచ్చరిక
శంకరపట్నం, డిసి ప్రతినిధి:
సంవత్సరం గడిసినా జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను పాటించని మండల స్థాయి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ జన సమితి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మోరె గణేష్. శంకరపట్నం మండలంలోని మొలంగూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
మొలంగూర్ గ్రామంలోని బీసీ కాలనీలో 703 సర్వే నంబరులోని భూమిని కొంతమంది భూస్వాములు (అగ్ర కులాలకు చెందినవారు) అక్రమంగా ఆక్రమించి, పశువుల షెడ్లు నిర్మించారని ఆయన ఆరోపించారు. ఈ విషయమై జన సమితి పార్టీ తరఫున గతంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయగా, కలెక్టర్ స్పందించి సర్వే చేయించి, భూమి హద్దులు కూడా నిర్ణయించినట్టు తెలిపారు.
కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం అక్రమ నిర్మాణాలను తొలగించి, భూమిని స్వాధీనం చేసుకోవాల్సిన బాధ్యత మండల తహసీల్దార్, ఎంపీడీవో, ఎంపీవో మరియు గ్రామపంచాయతీ కార్యదర్శులపై ఉండి కూడా వారు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఏడాది కాలంగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.
గణేష్ డిమాండ్లు:
-
ఆక్రమణకు గురైన భూమిని వెంటనే స్వాధీనం చేయాలి.
-
అక్రమంగా నిర్మించిన షెడ్లను తొలగించాలి.
-
ఇండ్లు లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి.
-
పేదలకు భూమిపై గూడు ఏర్పాటు చేసే అవకాశం కల్పించాలి.
ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించకపోతే, జన సమితి పార్టీ భూ హక్కుల కోసం ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తుందని, మండల స్థాయిలో ఆందోళనలు ప్రారంభిస్తామని గణేష్ హెచ్చరించారు.

శుభారంభానికి శుభదీపం!
Silver డాన్సింగ్ గణేష్ దీపం – 5 వత్తుల హోల్డర్‌తో స్టాండ్付き ✨
ధార్మికత & అలంకరణకు అద్భుతమైన కలయిక
ప్యాకేజీలో: 1 గణేశుడు దీపం (మెటల్, సిల్వర్ ఫినిష్)
పూజా గది, టేబుల్ డెకర్, ఫెస్టివల్ డెకరేషన్‌కు బెస్ట్
వినాయక చవితి, దీపావళి, నవరాత్రులు – ప్రతి శుభకార్యానికీ సరైన దీపం
నెగెటివ్ ఎనర్జీని తొలగించు శక్తివంతమైన శోభాయమానమైన దీపం
ఇప్పుడు కేవలం ₹261/- (56% తగ్గింపు)
ఆర్డర్ చేయాలంటే https://amzn.to/4lMgCs7 లింక్ పై క్లిక్ చేయండి..
