టెట్‌ హాల్‌టికెట్లు విడుదల

అధికారిక వెబ్‌సైట్‌లో నుంచి డౌన్లోడ్
హైదరాబాద్ : తెలంగాణ టీచ‌ర్ ఎలిజిబుల్ టెస్ట్ హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. హాల్‌టికెట్లు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈనెల 15న టెట్‌ పరీక్ష నిర్వ‌హించ‌నున్నారు. అభ్య‌ర్థి హాల్‌ టికెట్‌పై ఫోటో రాకుంటే పాస్‌పోర్టు సైజు ఫోటో అతికించి, గెజిటెడ్‌ ఆఫీసర్‌ చేత సంతకం చేయించాలి. ఆ త‌రువాత ఆ హాల్‌ టికెట్‌ను డీఈవోకి సమర్పిస్తే, పరిశీలించి పరీక్షకు అనుమతి ఇస్తారు. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్టేష్రన్‌ నంబర్‌, పుట్టిన తేదీ లేదా మొబైల్‌ నంబర్‌, పుట్టిన తేదీని నమోదుచేసి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 15న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష నిర్వహిస్తారు. ఫలితాలను ఈ నెల 27న వెల్లడించనున్నారు. టీఎస్‌ టెట్‌-2023 నోటిఫికేషన్‌ ఆగస్టు 1న విడుదలైన విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌ దరఖాస్తుల పక్రియ ఆగస్టు 2 నుంచి 16 వరకు జరిగింది. మొత్తం 2,83,620 అప్లికేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు. టెట్‌కు 20 శాతం వెయిటేజ్‌ ఉన్న విషయం తెలిసిందే. మొత్తం 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో చైల్డ్‌ డెవలప్‌మెంట్‌కు 30 మార్కులు, జనరల్‌ తెలుగు 30 మార్కులు, ఇంగ్లిష్‌ 30, మిగిలిన స్జబెక్టులకు 60 మార్కుల చొప్పున
కేటాయించారు. కాగా, ఉపాధ్యాయ నియామక పరీక్ష డీఎస్సీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. మొత్తం 5089 పోస్టులను భర్తీ చేస్తున్నది. దీనికి సంబంధినంచిన ఆన్‌లైన్‌ దరఖాస్తు పక్రియ సెప్టెంబర్‌ 20 నుంచి ప్రారంభం కానుంది. అక్టోబర్‌ 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్‌ 20 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం పట్టణాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *