శంకరపట్నం, డిసీ ప్రతినిధి:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ అగ్రనేత, “కమలాపూర్ బుల్లోడు”, కరీంనగర్ జిల్లా టైగర్గా పేరు పొందిన దివంగత ముద్దసాని దామోదర్ రెడ్డి గారి సేవలు ప్రజలు ఎప్పటికీ మరవలేరని తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంట్ హడక్ కమిటీ సభ్యులు మోరె ప్రభాకర్ అన్నారు.
ఆదివారం శంకరపట్నం మండల కేంద్రంలో ముద్దసాని దామోదర్ రెడ్డి 69వ జయంతిని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మోరె ప్రభాకర్ గారు దివంగత నేత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
“ముద్దసాని దామోదర్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో ఒక విజేత నేతగా, ప్రజల మద్దతుతో ఎన్నడూ వెనక్కి తగ్గని నాయకుడిగా నిలిచారు. NTR ప్రియ శిష్యునిగా, నారా చంద్రబాబు నాయుడు గారి అత్యంత సన్నిహితుడిగా రాష్ట్ర అభివృద్ధికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి.”
ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా కదిరే కొమురయ్య, బైరి తిరుపతి, గోడిశాల రాములు, గోపి వీరమల్లు, మహమ్మద్ సాబీర్, సముద్రాల సంపత్ తదితరులు పాల్గొన్నారు.
