Rajireddy Comments” జిల్లా వ్యవసాయ సంఘ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి..
శంకరపట్నం: డిసి ప్రతినిధి: రాష్ట్రంలో రైతులకు పంట సాగు కు యూరియా అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని జిల్లా వ్యవసాయ సంఘం ప్రధాన కార్యదర్శి వెల్మారెడ్డి రాజిరెడ్డి ఆరోపించారు. కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, మండల శంకరపట్నం శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజిరెడ్డి మాట్లాడారు. వానకాలం పంటకు తెలంగాణ రాష్ట్రంలో యూరియా వాడకం ఎంత అనేది. రాష్ట్ర ప్రభుత్వము ముందస్తుగా అంచన వేయకపోవడంతో ఈ పరిస్తితి తలెత్తిందన్నారు. వేసిన పంటలు చేతికి అంది వస్తాయో రావోనని, దిగులుతో రైతన్న దిగాలు చెందుతున్న ఘటనలు ఎన్నో ఉన్నాయని విమర్శించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యూరియా, అందించడంలో పూర్తిగా విఫలమైందని చెప్పారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర హోంశాఖ సహాయం మంత్రి బండి సంజయ్ కుమార్ యూరియా దిగుమతిలో విఫలమయ్యారని, రాష్ట్రంలో సహకార సంఘాల ఆధ్వర్యంలో విక్రయిస్తున్న యూరియాకు ఒక బస్తాకు 272 రూపాయలకు హమాలి కూలీలతో సహా విక్రయించడం జరుగుతుందన్నారు. కానీ శంకరపట్నం ప్రైవేట్ ఫెర్టిలైజర్ దుకాణ యజమానులు రూ.350 నుండి రూ.400 రూపాయల అధిక ధర తీసుకుంటున్నారని ఆరోపించారు. ఈ ధరలను నియంత్రించాల్సిన మండల వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శించారు. అధిక ధరలకు విక్రయిస్తున్న ఫెర్టిలైజర్ షాప్ యజమానులపై వ్యవసాయ శాఖ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు తగిన న్యాయం చేయకుంటే, రైతుల పక్షాన జిల్లా వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని రాజిరెడ్డి హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల వ్యవసాయ సంఘం కార్యదర్శి మైదo శెట్టి యుగేందర్, కే రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ ఎస్ విమర్శలు ఎక్కుపెడుతోంది. ఇస్తామన్న హామీల అమలుకు డిమాండ్ చేస్తోంది బీఆర్ ఎస్. ఇప్పటికే రెండు మూడు సార్లు హామీల…
శంకరపట్నం డిసి ప్రతినిధి.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం, శంకరపట్నం మండలం కరీంపేట గ్రామానికి చెందిన శ్రీ భక్తాంజనేయ భజన మండలికి…