Vidyasagar Zptc” రిజర్వేషన్ అనుకూలిస్తే… ఎమ్మెల్యే ఆశీర్వదిస్తే… జడ్పిటిసి ఎన్నికలకు సిద్ధం: విద్యాసాగర్

Vidyasagar Zptc”  శంకరపట్నం, కరీంనగర్ జిల్లా – మానకొండూర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు, దళిత వర్గానికి చెందిన కనకం విద్యాసాగర్ శంకరపట్నం జడ్పిటిసి స్థానం ఎస్సీ రిజర్వేషన్ కింద ఉంటే, పార్టీ ఆమోదంతో ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తిని వ్యక్తం చేశారు.

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ – “మానకొండూర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆశీర్వాదం లభిస్తే, శంకరపట్నం జడ్పిటిసి అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నాను” అని మీడియాతో వెల్లడించారు.

ముత్తారం గ్రామానికి చెందిన విద్యాసాగర్ కాంగ్రెస్ పార్టీకి నిబద్ధతతో పని చేస్తూ, శంకరపట్నం మండలంలో అన్ని గ్రామాల్లో ప్రజల మద్దతును సంపాదించుకున్నాడు. స్థానిక నాయకులు, కుల పెద్దలు, వివిధ వర్గాల ప్రజలు తనకు బలమైన మద్దతునిస్తారని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *