Local News” శంకరపట్నం డిసి ప్రతినిధి
దేవక్క పల్లెలో గ్రామ దేవతలైన బొడ్రాయి ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని, దేవక్కపల్లి గ్రామంలో గ్రామ దేవతల విగ్రహాల ప్రతిష్టాపన (బొడ్రాయి) వేడుకలు ఈనెల 11 నుంచి 15 వరకు ఘనంగా నిర్వహిస్తున్నారు . వేద పండితులు మధుసూధన చార్యులు, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో గ్రామంలో అలంకరణ, నాలుగు దిక్కుల తోరణాలు , జ్యోతి ప్రజ్వలన, విగ్నేశ్వర పూజ, కర్పూర హారతి, ప్రసాదాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మూడో రోజు నిత్య, హోమాలు, క్షీరధివాసం, జలస్నానాలు, మంగళ హారతి ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం ఉదయం గ్రామ దేవతల బొడ్రాయి విగ్రహాలను వేద పండితులు మంత్రోచ్ఛారణల నడుమ ప్రతిష్టపించారు. గ్రామ పెద్దల సమక్షంలో పూజలు నిర్వహించగా మహిళలు మంగళహారతి తో ప్రతిష్టాపన చేసిన బొడ్రాయి దేవత మూర్తులకు నైవైద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించుకున్నారు. గురువారం హోమాలు, వసంతోత్సవం, అష్టదిగ్బంధనం ఊరడి బలి (పూజ) తెల్లవారుజామున బలి తిరుగుట కార్యక్రమం నిర్వహిస్తారు. గ్రామంలోని ప్రజలు బయటకు పోకూడదు. బయట ప్రజలు లోనికి రాకూడదు. బయట వారు లోనికి రాకూడదని తెలిపారు.
Local News” దేవక్కపల్లి లో ఘనంగా బొడ్రాయి ప్రతిష్టాపన..
