District Coordinator”
శంకరపట్నం: డిసి ప్రతినిధి:
కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ గా ముక్కెర సతీష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ, కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం గంగిపల్లి గ్రామానికి చెందిన తనను జాతీయ నాయకులు నియమించారని, నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు.
సతీష్ తన నియామకానికి సహాయపడిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జెక్కడీ శివ చరణ్ రెడ్డి, మానకొండూర్ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మజీద్ ఖాన్, రాష్ట్ర సెక్రటరీ ఉమ్మెత్తుల శ్యాంసుందర్, మానకొండూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందగిరి రవీంద్రాచారి, జిల్లా జనరల్ సెక్రటరీ తాళ్లపల్లి సంపత్, యూత్ కాంగ్రెస్ నాయకులు గుర్రం శ్రీనివాస్, రాళ్లపల్లి శ్రీకాంత్, అరవింద్, సిద్ధార్థ మరియు ఇతర జిల్లా, మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
