Education” మానవులంతా సమానమే
అంబేద్కర్ ఆశయాలు చదివే లక్ష్యం
మండల ప్రత్యేక అధికారి హుక్య నాయక్
శంకరపట్నం: డిసి ప్రతినిధి:
విద్యతోనే సమాజంలో గుర్తింపు, మానవులంతా సమానం అని మండల ప్రత్యేక అధికారి హుక్య నాయక్ అన్నారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఆముదాలపల్లి గ్రామంలో శనివారం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా హుక్య నాయక్ మాట్లాడుతూ… భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలంటే కుల, మతభేదం లేకుండా ఉన్నత చదువు లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. భారత రాజ్యాంగం లో ఎస్సీ, ఎస్టీ, బహుజనులు మరియు పేద వర్గాల ఆర్థిక అభివృద్ధి కోసం విద్య, సమానత్వం కోసం చట్టాలు తీసుకొచ్చిన అంబేద్కర్, వారి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పేర్కొన్నారు.
అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ ఉన్నత చదువులు చదివి, ఉన్నత ఉద్యోగాలు పొందాలని యువతకు సూచించారు. కుల మత విభేదం లేకుండా, సమాజంలో గుర్తింపు పొందాలని, ప్రతి ఒక్కరూ చదివే లక్ష్యంగా ముందుకు సాగాలని హుక్య నాయక్ పేర్కొన్నారు. అలాగే, ప్రభుత్వాలు అంబేద్కర్ చట్టాలను అమలు చేస్తూ ప్రజల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గోల్కొండ కృష్ణ ప్రసాద్, ఎంఈఓ లక్ష్మీనారాయణ, డాక్టర్ శ్రావణ్ కుమార్, సాంఘిక సంక్షేమ వసతి గృహం అధికారి తిరుపతిరెడ్డి, ఆర్ఐ రాములు, గ్రామ మాజీ సర్పంచ్ బత్తుల మానస, కాచాపూర్ మాజీ సర్పంచ్ కొండ్ర రాజయ్య, దళిత సంఘ నాయకులు ఆరేపల్లి ఓదేలు, అంబేద్కర్ సీనియర్ నాయకుడు దేవుని కిష్టయ్య, నమిన్ల ఎల్లయ్య, మరియు ఇతరులు పాల్గొన్నారు.
