BjpCycleDistribution” శంకరపట్నం, సెప్టెంబర్ 2 (డిసి ప్రతినిధి):
పేద కుటుంబాల విద్యార్థులకు ఉన్నత విద్యకు ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ఒక విశేష సంకల్పం తీసుకున్నారు. “మోదీ కానుక”గా ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు బీజేపీ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి తెలిపారు.
మంగళవారం మానకొండూర్ నియోజకవర్గంలోని శంకరపట్నం మండలం, మొలంగూర్ గ్రామంలోని జిల్లా పరిషత్తు పాఠశాల వద్ద జరిగిన కార్యక్రమంలో పదవ తరగతి విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు ఎనుగుల అనిల్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా మాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ, “విద్యే ఆయుధం. పేద పిల్లలు చదువుతోనే తమ భవిష్యత్తు నిర్మించుకోవాలి. రవాణా సౌకర్యాల లోపంతో చదువులు మధ్యలో ఆపేయకూడదు. అందుకే బండి సంజయ్ గారు ఈ సంకల్పం చేశారు” అని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని, తద్వారా ఉన్నత చదువులకు అర్హత పొందాలని సూచించారు.
జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో విద్యకు అడ్డంకిగా మారే సమస్యల్ని అధిగమించేందుకు ఈ రకమైన సహాయాలు అవసరమని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:
మండల బీజేపీ అధ్యక్షుడు అనిల్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు బిజిలి సారయ్య, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు కొమురయ్య, మండల ప్రధాన కార్యదర్శి దాసారపు నరేందర్, నాయకులు రాస మల్ల శ్రీనివాస్, దొంగల రాములు, వీరార్జున్, సాయి, తుమ్మ రాజు, మల్లేష్ తదితరులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Khaidi 2″ ఖైదీ 2 సంగీతానికి అనిరుధ్ – అభిమానుల్లో మిశ్రమ స్పందనలు లింక్ పై క్లిక్ చేయండి..

Laptop Review” ల్యాప్టాప్ లు కొనాలనుకుంటున్నారా…? ఇది చూడండి ఒక సారి లింక్ పై క్లిక్ చేయండి..
