BrsProtest” పీఎస్ ఘోష్ నివేదిక తప్పుడు నివేదికే: బీఆర్‌ఎస్ పార్టీ నిరసన

BrsProtest”  శంకరపట్నం, సెప్టెంబర్ 2 (డిసి ప్రతినిధి):
తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీఎస్ ఘోష్ ఇచ్చిన నివేదికను ఖండిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. మంగళవారం మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, ర్యాలీ, రాస్తారోకో నిర్వహించగా, నేతలు ఘోష్ నివేదిక ప్రతులను చింపి జాతీయ రహదారిపై విసిరారు.

ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు గంట మహిపాల్ మాట్లాడుతూ, “పీఎస్ ఘోష్ ఇచ్చిన నివేదిక పూర్తిగా రాజకీయ ప్రేరితమై ఉంది. ఈ నివేదిక ఆధారంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై సీబీఐ దర్యాప్తు ప్రకటించడం బాధాకరం” అని పేర్కొన్నారు.

అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం, కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
నిరసనలో భాగంగా, బీఆర్‌ఎస్ నేతలు శంకరపట్నం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.

పోలీసులు ధర్నా విరమింపజేశారు
ధర్నా సమాచారం అందుకున్న కేశవపట్నం ఎస్‌ఐ కట్కూరి శేఖర్ రెడ్డి పోలీస్ బలగాలతో సంఘటన స్థలానికి చేరుకొని నాయకులతో చర్చించి ధర్నాను విరమింపజేశారు.

పాల్గొన్న ప్రముఖులు:
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మేకల కుమార్, మాజీ జెడ్పీటీసీ పొద్దుటూరి సంజీవరెడ్డి, ఎంపీటీసీ ఫోరం మాజీ అధ్యక్షులు పెద్ది శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీటీసీలు గాండ్ల తిరుపతి, వావిలాల రాజు, సమ్మయ్య, రంజిత్ రావ్, మహేందర్ రెడ్డి, శేషాచారి, మలహల రావు (మచ్చ గిరింద్ర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్) తదితరులు పాల్గొన్నారు.

అలాగే, గ్రామ శాఖ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

నయా గేమింగ్ బీట్ వచ్చేసింది!
HP Omen Ryzen 7 + RTX 4060
16GB DDR5 RAM | 1TB SSD | 165Hz డిస్‌ప్లే
Cool RGB Keyboard, Tempest Cooling ❄️
ఎంత సూపర్‌ అంటే… GTA, COD, Cyberpunk – అన్నీ MAX సెట్టింగ్స్‌లో!

ప్రొ గేమర్స్ కోసం!
#HPOmen #GamingBeast #LevelUp
లింక్ పై క్లిక్  https://amzn.to/3HDqo1Jచేసి అమెజాన్‌లో కొనుగోలు చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *