Prajavani” నాలుగు వారాలు నిర్వహిస్తే రెండు వినతి పత్రాలు…
శంకరపట్నం: డిసి ప్రతినిధి:
ప్రజావాణి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఒకే ఒక వినతి పత్రం వచ్చినట్లు డిప్యూటీ తాసిల్దార్ పార్థసారధి తెలిపారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గత నాలుగు వారాల నుండి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి వివిధ శాఖల అధికారులు హాజరై మండల ప్రజల నుండి సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాలను స్వీకరించినట్టు చెప్పారు. మొదటి సోమవారంలో ఒకే ఒక దరఖాస్తు భూమి పరిష్కారం కోసం ఓ వ్యక్తి వినతి పత్రాన్ని అందజేసినట్లు పేర్కొన్నారు. రెండు, మూడు, ప్రజావాణిలో ఒక్క వినతి పత్రం రాలేదని, నాలుగో వారం భూ సమస్య పరిష్కారం కోసం ఓ వినతి పత్రం రైతు అందజేశారన్నారు. ఈ ప్రజావాణి క మండలంలోని వివిధ శాఖల అధికారులు తదితరులు హాజరైనట్లు డిప్యూటీ తాసిల్దార్ పార్థసారధి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Dasara Holidays” దసరా సెలవుల షెడ్యూల్ ప్రకటన
Hisense” హైసెన్స్ 43E6N స్మార్ట్ 4K గూగుల్ టీవీ – బడ్జెట్‌లో హైఎండ్ ఫీచర్లు!
