Shankarapatnam” శంకరపట్నం డిసీ ప్రతినిధి
మొలంగూర్ 703 ప్రభుత్వ భూమిలో ఇండ్ల స్థలాలు కేటాయించాలి…
జన సమితి జిల్లా కన్వీనర్ గణేష్
కరీంనగర్: కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో తెలంగాణ జన సమితి (టీజేఎస్) జిల్లా కన్వీనర్ మోరె గణేష్ మాట్లాడుతూ, కలెక్టర్ ఆదేశాలను మండల అధికారులు నిర్లక్ష్యంగా అంగీకరించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
గణేష్ గురువారం కరీంనగర్ జిల్లా మొలంగూర్ గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ, “మొలంగూర్ గ్రామంలో సర్వే నంబర్ 703 ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని, టీజేఎస్ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించాం. ఈ పోరాటానికి జిల్లా అధికారుల స్పందన వలన సర్వే చేయడం జరిగిందని” అన్నారు.
అయితే, సర్వే నివేదిక ప్రకారం, 703 సర్వే నంబర్ లో 4 ఎకరాలు ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని గణేష్ వివరించారు. ఈ భూమిని ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ఉపయోగించాలని డిమాండ్ చేశారు.
గణేష్ మాట్లాడుతూ.. “ఈ ఆక్రమణ భూమిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలకు ఇండ్లు కేటాయించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా మండల అధికారులు స్పందించి 18వ తేదీ లోపు ఈ భూమిని స్వాధీనం చేసుకోవాలి” అని చెప్పారు. లేకుంటే మండల కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో తెలంగాణ జన సమితి నాయకులు కోరపల్లి శివ ప్రసాద్, శివ సాయి, గాజుల శ్యామ్, మరియు ఇతరులు పాల్గొన్నారు.
Congress Manakondur” తెలంగాణలో ప్రజాపాలనకు ఆదరణ.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో భారీగా చేరికలు
Amazon Prime” అమెజాన్ ప్రైమ్ డే 2025 – మీ షాపింగ్ ఫెస్టివల్ వచ్చేసింది!
Jaguar Crash” భారత వైమానిక దళ విమానం ప్రమాదం… ఇద్దరు పైలట్లు మృతి
