Cpm” నానోపై ప్రేమ, యూరియాపై ద్వేషం, సబ్సిడీ కోత కేంద్ర విధానం..

Cpm”  గీట్ల ముకుంద రెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు…
శంకరపట్నం: డిసీ ప్రతినిధి:
నానో పై ప్రేమ యూరియా పై ద్వేషం సబ్సిడీల కోత కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ విధానమని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్ట్‌) కరీంనగర్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గీట్ల ముకుంద రెడ్డి ఆరోపించారు. సోమవారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం ,భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ శంకరపట్నం మండల కమిటీ సమావేశం కామ్రేడ్ కే దుర్గాప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గీట్ల ముఖందర్ రెడ్డి మాట్లాడారు.
యూరియా కోసం కేంద్ర ప్రభుత్వం విదేశీ కంపెనీలకు గతేడాది 71.74 లక్షల టన్నులకు ఇండెంట్ పెట్టగా ఈ యేడాది 60.62 లక్షల టన్నులకే పరిమితం అయిందన్నారు. దేశీయంగా ఉత్పత్తి 9 శాతానికి తగ్గించారని, నానో యూరియాను ప్రమోట్ చేయడం, సబ్సిడీలను తగ్గించుకునే కుట్రలో భాగంగానే కొరత సృష్టించారన్నారు. ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందన్నారు. 2024 మేలో కోటి పది లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉండగా, 2025 మే లో 60 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే నిల్వలు ఉన్నాయన్నారు.తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సకాలంలో యూరియాను అందించడంలో తీవ్రంగా వైఫల్యం చెందిందన్నారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వెల్మారెడ్డి రాజిరెడ్డి,చక్రపాణి, కే వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

 

 

Dasara Holidays” ద‌స‌రా సెల‌వుల షెడ్యూల్ ప్ర‌క‌ట‌న‌

Hisense” హైసెన్స్ 43E6N స్మార్ట్ 4K గూగుల్ టీవీ – బడ్జెట్‌లో హైఎండ్ ఫీచర్లు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *