Karimnagar : వెలిచాల, సెప్టెంబర్ 12 : ఎన్ ఎస్ ఎస్ సేవా కార్యక్రమాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వుమెన్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఏడు రోజుల పాటు రామడుగు మండలం వెలిచాల గ్రామంలో సేవలందిస్తున్నారు. ఇందులో భాగంగానే రెండవ రోజు శుక్రవారం నాడు వెలిచాల గ్రామంలోని శివాలయ ప్రహరీ గోడలకు రంగులు వేశారు. ఆలయ పునరుద్ధరణలో భాగంగా ప్రహరీ గోడలకు వర్ణాలు అద్దడం గ్రామ ప్రజల్లో విశేష ఆసక్తిని రేపింది.
అనంతరం మధ్యాహ్నం జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా దత్తాత్రి శర్మ హాజరై మాట్లాడారు. “మానవ సేవే మాధవ సేవ” అని వ్యాఖ్యానించారు. ఎన్ ఎస్ ఎస్ సేవా కార్యక్రమాలు సమాజ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నాయని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వరలక్ష్మి, ఎన్ ఎస్ ఎస్ ఆఫీసర్ స్రవంతి, శ్రీకృష్ణ, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సేవా తత్పరతను వారు అభినందించారు.


