- నేటి నుంచి 16 వరకు దరఖాస్తులు
- సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష నిర్వహణ
ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్. తెలంగాణాలో టెట్ నిర్వహణకు నోటిఫికేషన్ రీలీజ్ చేశారు. మంగళవారం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. వచ్చేనెల 15న టెట్ పేపర్-1, పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు. నేటి (బుధవారం) నుంచి నుంచి ఆగస్టు 16వ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. పేపర్-1 పరీక్షకు డీఈడీ, బీఈడీ అభ్యర్థులు ఇద్దరూ రాసుకునే అవకాశం కల్పించారు. బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులు పేపర్-2తోపాటు పేపర్-1 పరీక్ష కూడా రాయవచ్చు. మంత్రివర్గ ఉపసంఘం లో టెట్ నిర్వహణకు ఆమోదం తెలిపింది. రాతపరీక్ష సెప్టెంబర్ 15న నిర్వహిస్తారు. పేపర్-1: ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు , పేపర్-2: మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండనుంది. ఎగ్జామ్ ఫీజు రూ.400గా పేర్కొన్నారు. దాదాపు 2 లక్షల మందికిపైగా అభ్యర్థులు పోటీపడనున్నారు. రెండు సంవత్సరాల క్రితం టెట్ వ్యవధిని జీవితకాలం పొడిగించారు.