Karimnagar latest news” ఘనంగా సంత్ కార్డ్ గే బాబా వర్ధంతి వేడుకలు..

shankarapatnam

Karimnagar latest news” ఘనంగా సంత్ కార్డ్ గే బాబా వర్ధంతి వేడుకలు..
రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సంపత్ కుమార్..
నేటి కరీంనగర్-శంకరపట్నం:
శుభ్రత సామాజిక భద్రత స్ఫూర్తిదాయకుడు సంత్ గాడ్గే బాబా అని రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూసాల సంపత్ కుమార్ జిల్లా అధ్యక్షులు రాచకొండ నరేష్, కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు లింగంపల్లి నాగరాజ్ అన్నారు. కరీంనగర్ పట్టణంలో జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో శనివారం సంత్ గాడ్గే బాబా 70వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు పూసల సంపత్ కుమార్ మాట్లాడుతూ .. సూచి శుభ్రత సామాజిక భద్రత, నేటి సమాజానికి సంత్ గాడ్గే బాబా స్ఫూర్తిని ఇచ్చార‌ని ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. రానున్న జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో రజక సోదరులు రాజకీయంగా ఎదిగేందుకు పోటీ చేసి గెలుపొందాలని ఆకాంక్షించారు. రజక కుల బాంధవులకు రజక సంఘం అండగా ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పూసాల సంపత్ కుమార్, జిల్లా అధ్యక్షుడు రాచకొండ నరేష్, గౌరవాధ్యక్షులు కొత్తకొండ రాజయ్య, కరీంనగర్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు లింగంపల్లి నాగరాజ్, ప్రధాన కార్యదర్శి కొత్తకొండ శ్రీనివాస్, డ్రై క్లీనింగ్ అసోసియేషన్ అధ్యక్షులు బూత్కూరి శివ కృష్ణ, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గంగిపల్లి విష్ణు జిల్లా నాయకులు వనపర్తి శంకర్, కొత్తకొండ లక్ష్మీనారాయణ, కొత్తకొండ లక్ష్మణ్ రాచకొండ కొమురయ్య , పొన్నాల తిరుపతి రాచకొండ శ్రీనివాస్, నేదునూరి మహేష్, పొన్నాల అజయ్ నగునూరి ఎల్లయ్య, పొన్నాల సంజీవ్ దురిచేట అజయ్, గంగాధర కళ్యాణ్, మునిగంటి లింగయ్య, లింగంపల్లి వెంకటేష్ , ముంజంపల్లి లింగయ్య, లింగంపల్లి కనకయ్య, రాచకొండ ఉమేష్, పత్తిపాక ఆంజనేయులు, జిల్లా నాయకులు, రజక కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

రాబోయే జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు కార్యకర్తలు సైనికుల పనిచేయాలని బిజెపి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ క్రాస్ రోడ్ వద్ద విఎస్సార్ గార్డెన్ లో బిజెపి పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను శనివారం సన్మానించారు. పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కృష్ణారెడ్డి హాజ‌రై మాట్లాడారు. నాయకులు కార్యకర్తలు సైనికుల పనిచేసి జెడ్పిటిసి ఎంపిటిసిలుగా బిజెపి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ పార్టీ ఇంచార్జ్ బోయినపల్లి ప్రవీణ్ రావు, పార్టీ మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి, అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి, సర్పంచులు కొయ్యడ రజిత అశోక్ యాదవ్, కొయ్యల కుమార్ యాదవ్, వెన్నం మల్లేశం, గద్దపాక ఉపసర్పంచ్ జంగ జైపాల్ యాదవ్, వార్డు సభ్యులు,పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

 

బుకింగ్ యాప్ తో యూరియా కొనుగోలు చేయడం సులభతరం
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్ద‌ప‌ల్లి జిల్లా
బుకింగ్ యాప్ తో యూరియా కొనుగోలు చేయడం సులభతరం అని పెద్ద‌ప‌ల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. శనివారం పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తా వద్ద గల మహేష్ ఫెర్టిలైజర్స్ ఎరువుల షాపును జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ.. యూరియా లభ్యతపై రైతులకు ఎటువంటి అనుమానాలు, అపోహలు అవసరం లేదని, ప్రతి రైతుకు అవసరమైన మేర యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ తెలిపారు. యూరియా ప్రతి రైతుకు చేరాలని ఉద్దేశంతో జిల్లాలో యూరియా ట్రాకింగ్ యాప్ సిద్ధం చేశామని కలెక్టర్ తెలిపారు.
నెల రోజుల నుండి యాప్ ద్వారా ఎరువుల విక్రయాలు జిల్లాలో పర్యవేక్షించామని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం మరింత మెరుగ్గా యూరియా బుకింగ్ యాప్ ప్రవేశ పెట్టిందని అన్నారు. ఓలా, ఉబర్ వంటి యాప్ లలో టాక్సీ ఎలా బుక్ చేస్తామో , అదేవిధంగా సులభంగా ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.

రైతులు తమ ఇంటి వద్ద నుంచి యూరియా బుక్ చేసుకుని ఎరువుల షాప్ నకు స్వయంగా వచ్చి లేదా ఇతరులతో తమ బుక్ చేసుకున్న బస్తాల వివరాలు, ఓటిపి చెప్తే షాప్ యజమానులు యూరియా సరఫరా చేస్తారని, ఈ యాప్ ఉపయోగించడం వల్ల రైతుల సమయం వృధా కాదని, లైన్లలో నిలబడకుండా సరైన సమయంలో వచ్చి యూరియా తీసుకువెళ్లచ్చన్నారు.

యాప్ విధానం ద్వారా రైతులు అవసరానికి మించి యూరియా తీసుకొని వెళ్లి స్టాక్ పెట్టుకోవడం నియంత్రించవచ్చని, చిన్న సన్న కారు రైతులకు ఎటువంటి యూరియా కొరత రాకుండా ఉంటుందని తెలిపారు.

రైతులు తమ వ్యవసాయ భూమి వివరాలు తమకు ఎంత యూరియా అవసరమంటుందో ఇంకా ఎన్ని కావాలో అనే అంశాలు ఈ యాప్ లో నమోదవుతాయని కలెక్టర్ తెలిపారు. రైతులు ఈ యాప్ ను ఉపయోగించడం సులభంగా ఉంటుందని ప్రతి ఒక్కరూ యాప్ ఉపయోగించుకొని యూరియా కొనుగోలు చేయాలని ఆప్ ఉపయోగించడంలో ఏదైనా సమస్యలు ఏర్పడితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, ఏ. ఓ.లు,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

 

కేడీసీసీ పర్సన్ ఇన్ ఛార్జిగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బాధ్యతల స్వీకరణ
కరీంనగర్
కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పర్సన్ ఇన్ చార్జిగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఉన్న పాలకవర్గాలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో కేడీసీసీబీ పర్సన్ ఇన్చార్జిగా జిల్లా కలెక్టర్ బాధ్యతలు స్వీకరించారు.

 

 

శివ్ కృపా బ్లూ పాటరీ
హ్యాండ్‌మేడ్ సిరామిక్ బాత్రూమ్ ట్రే ✨
4×8 ఇంచుల రెక్టాంగ్యులర్ డిజైన్
అందమైన బ్లూ పాటరీ ఆర్ట్‌తో ప్రత్యేక ఆకర్షణ

బాత్రూమ్ డెకార్‌కు చక్కని ఎంపిక ✔️
నాణ్యతతో పాటు సంప్రదాయ కళ

https://amzn.to/48OZ2jWలింక్ పై క్లిక్ చేసి అమెజాన్‌లో కొనండి

 

Shiv Kripa Blue Pottery
హ్యాండ్‌మేడ్ సిరామిక్ బాత్రూమ్ ట్రే
4×8 ఇంచుల రెక్టాంగ్యులర్ డిజైన్
అందమైన బ్లూ పాటరీ కళతో ప్రత్యేక లుక్ ✨

బాత్రూమ్ డెకార్‌కు పర్ఫెక్ట్ ఎంపిక ✔️
 https://amzn.to/44FvCCd
లింక్ పై క్లిక్ చేసి అమెజాన్‌లో కొనండి

 

 

Shiv Kripa Blue Pottery
హ్యాండ్‌మేడ్ సిరామిక్ వేజ్
సైజ్: 5 ఇంచులు
అందమైన బ్లూ పాటరీ డిజైన్ ✨

ఇంటి డెకార్‌కు క్లాసిక్ & ఎలిగెంట్ ఎంపిక ✔️

 https://amzn.to/3MJB2Gk
లింక్ పై క్లిక్ చేసి అమెజాన్‌లో కొనండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *