Peddapalli” జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎం. రాజశేఖర్
పెద్దపల్లి |
పెద్దపల్లి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషి విజ్ఞాన్ ఫెర్టిలైజర్స్ కంపెనీ ఆధ్వర్యంలో జనవరి 23 (శుక్రవారం) రోజున జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎం. రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ జాబ్ మేళా నూతన కలెక్టర్ భవన సముదాయం, పెద్దపల్లి లోని జిల్లా ఉపాధి కార్యాలయం (రూమ్ నెంబర్ 233, మొదటి అంతస్తు) లో జరుగుతుందని పేర్కొన్నారు.
ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలు
కృషి విజ్ఞాన్ ఫెర్టిలైజర్స్ కంపెనీలో మొత్తం 67 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.
-
సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు – 60
-
ఫీల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్లు – 4
-
హెచ్‌ఆర్ (HR) – 2
-
ఆఫీస్ బాయ్ – 1
విద్యా అర్హతలు
-
సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు: ఇంటర్మీడియట్ / డిగ్రీ / డిప్లమా
-
ఫీల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్లు: అగ్రికల్చర్ బీఎస్సీ
-
హెచ్‌ఆర్ పోస్టులు: ఎంబీఏ
-
ఆఫీస్ బాయ్: 10వ తరగతి
జాబ్ మేళా వివరాలు
-
తేదీ: జనవరి 23
-
సమయం: ఉదయం 11:00 గంటలకు
-
స్థలం:
రూమ్ నెంబర్ 233,
జిల్లా ఉపాధి కార్యాలయం,
నూతన కలెక్టర్ భవన సముదాయం,
పెద్దపల్లి (మొదటి అంతస్తు)
అభ్యర్థులకు సూచనలు
ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యా సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలు తీసుకొని నిర్ణీత సమయానికి హాజరై పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు.
మరిన్ని వివరాలకు సంప్రదించండి
📞 ఫోన్ నంబర్లు:
-
9908674056
-
8985336947
-
8121262441
